వాతావరణ పీడనంను కొలుచుట - Measuring Atmospheric Pressure
- భూమి ఉపరితలంపై, భూమిని ఆవరించియన్న గాలి కలిగించు పీడనమును వాతావరణ పీడనం అంటారు.
- భారమితి అను పరికరంతో వాతావరణ పీడనంను కొలవవచ్చు. తొట్టి భారమితిని 'టారిసెల్లి' అను శాస్త్రజ్ఞుడు తయారు చేశాడు.
- పాదరస భారమితి తయారీలో 1 మీటరు పొడవు, 1 సెం.మీ. వ్యాసం గల గాజు గొట్టంను వాడతారు. గాజు గొట్టంలో నిలిచి యున్న పాదరసంను పాదరస స్తంభం అంటారు. పాదరస స్తంభంపై ఏర్పడిన శూన్యప్రదేశాన్ని టారిసెల్లీ)శూన్య ప్రదేశం అంటారు.
- సాధారణంగా సముద్ర మట్టం వద్ద, వాతావరణ పీడనం 76 సెం.మీ.గా వుంటుంది. 60mm of Hg.
- సముద్ర మట్టం కన్నా ఎత్తు ప్రదేశాలకు వెళ్ళేకొద్దీ భారమితిలో పాదరస మట్టం తగ్గుతుంది.
- సముద్ర మట్టం కన్న దిగువ ప్రదేశాలకు వెళ్ళేకొద్దీ భారమితిలో పాదరస మట్టం ఎక్కువగా ఉంటుంది.
- సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీ. ఎత్తునకు 2.54 సెం.మీ. పీడనం తగ్గును.
- భారమితిలో పాదరస మట్టం నిదానంగా తగ్గితే వర్షం రాకను, పాదరస మట్టం హఠాత్తుగా తగ్గితే తుఫాన్ రాకను సూచిస్తుంది.
Vinays Info - General Science in Telugu