Vinays Info is an Educational Website.VinaysInfo provides latest Current Affairs in Telugu and English,General Knowledge in Telugu,GK in Telugu,TSPSC Study material in telugu,DSC Study materials in Telugu.

Sunday, 28 October 2018

Current Affairs

Telangana
Telangana

కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సుకు ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి ఆహ్వానం అందింది. 2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ జరిగే 49వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని వేదిక అధ్యక్షుడు బెర్జ్ బెండే కేటీఆర్‌ను ఆహ్వానించారు.

ఉద్దీపన

ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్శించేందుకు తెలంగాణలోని నకిరేకల్ నియోజకవర్గంలో ఉద్దీపన కార్యక్రమం అమలుచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నారు. ఉద్దీపన కార్యక్రమం ద్వారా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారు.

విద్యుత్ వినియోగం

విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో 7వ స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్ మండలి అక్టోబర్ 21న విడుదల చేసిన ఓ నివేదికలో వివరించింది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, కేరళ ఉన్నాయి. National
National

ప్రధానుల మ్యూజియానికి శంకుస్థాపన

న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో నిర్మించనున్న భారత ప్రధానుల మ్యూజియం నిర్మాణానికి కేంద్ర మంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్ సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. రూ. 271 కోట్లతో నిర్మించనున్న ఈ మ్యూజియంలో ప్రధాని పదవుల్లో ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పొందుపర్చనున్నారు.

ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తకావిష్కరణ

కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ రచించిన ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తకాన్ని అక్టోబర్ 16న న్యూఢిల్లీలో ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ఆవిష్కరించారు.

ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్ పేరు మార్పు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఇక్కడి గంగా-యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు పరిసర ప్రాంతాన్ని కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు.

లాన్సెట్ నివేదిక

లాన్సెట్ సంస్థ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా 2016లో శ్వాసకోశ సమస్యలవల్ల 48వేల మంది మరణించారు. అస్తమా వ్యాధిగ్రస్తుల్లో కేరళ మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణలో 19వేల మంది మరణించారు. ఆజాద్ హింద్ వార్షికోత్సవంఆజాద్ హింద్ సర్కార్ 75వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 21న ఢిల్లీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1943 అక్టోబర్ 21న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ సర్కార్‌ను ప్రారంభించారు.
International
International

ఉభయచర విమానం

అక్టోబర్ 20న ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం ఏజీ-600 తొలిసారిగా నీటిపై నుంచి నింగిలోకి ఎగిరింది. 15 నిమిషాల పాటు గగన విహారం అనంతరం విజయవంతంగా మళ్లీ నీటిపైనే దిగింది. దీన్ని ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా రూపొందించింది.

బ్రహ్మోస్‌కు పోటీగా చైనా కొత్త క్షిపణి

భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని గువాంగ్‌డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ అక్టోబర్ 15న ఓ సూపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీనికి హెచ్‌డీ-1 అని పేరుపెట్టింది.

గ్లోబల్ ఎంప్లాయర్స్ కంపెనీల జాబితా

ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్-2018 జాబితాను ఫోర్బ్స్ అక్టోబర్ 16న విడుదల చేసింది. 2000 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాలో అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్ అగ్రస్థానంలో నిలవగా మైక్రోసాఫ్ట్ రెండో స్థానం, ఆపిల్ మూడో స్థానం, వాల్ట్ డిస్నీ నాలుగో స్థానం, అమెజాన్ ఐదో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో 100లోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీల్లో ఎల్ అండ్ టీ 22వ స్థానం, మహీంద్రా అండ్ మహీంద్రా 55వ స్థానం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 59వ స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ 91వ స్థానాల్లో నిలిచాయి.

పొడవైన సముద్ర వంతెన

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను అక్టోబర్ 24న ప్రారంభించారు. పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్-జుహై-మకావు నగరాలను ఇది కలుపుతుంది. మొత్తం 55 కి.మీ. పొడవున్న ఈ వంతెన 22.9 కి.మీ. సముద్రంపై, 6.7 కి.మీ. సొరంగంలో ఉంది. 2009 డిసెంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది.

ఆసియా-ఐరోపా సమావేశం

ఆసియా-ఐరోపా యూనియన్ ప్రతినిధుల సమావేశం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో అక్టోబర్ 20న నిర్వహించారు. ఈ సమావేశాలకు భారత్ నుంచి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆంట్వెర్ప్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

మహాసముద్రాల లోతైన అధ్యయనం

ఐదు మహాసముద్రాల్లోని లోతుల్లో పరిశోధనలు చేపట్టేందుకు ఫైవ్ డీప్ ఎక్స్‌పెడీషన్ అనే పేరుతో ఓ భారీ మానవసహిత ప్రాజెక్టును శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు. దీనికోసం డీప్ సబ్ మెర్జిన్స్ వెహికిల్ అమిటింగ్ ఫ్యాక్టర్ అనే సబ్ మెర్సిబుల్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. దీని సాయంతో 36 వేల అడుగుల తోలుల్లోకి మానవులు చేరుకునే అవకాశం ఉంది.Sports
Sports

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 17వ స్థానం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో అక్టోబర్ 6 నుంచి నిర్వహిస్తున్న యూత్ ఒలింపిక్స్ పోటీలు అక్టోబర్ 18న ముగిశాయి. ఈ పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010లో 8 పతకాలతో 58వ స్థానంలో, 2014లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి.

ముంబైదే విజయ్ హజారే

దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన విజయ్ హజారే టైటిల్‌ను ముంబై జట్టు గెలుపొందింది. అక్టోబర్ 20న జరిగిన ఫైనల్‌లో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 12 ఏండ్ల తర్వాత ముంబై ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది.

షాంఘై మాస్టర్స్ విజేత జకోవిచ్

షాంఘై మాస్టర్స్ టోర్నీ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ నిలిచాడు. చైనాలోని షాంఘైలో అక్టోబర్ 14న జరిగిన ఫైనల్లో జకోవిచ్ క్రొయేషియా ఆటగాడు కొరిచ్‌పై గెలుపొందాడు.

డెన్మార్క్ ఓపెన్‌లో రన్నరప్‌గా సైనా

డెన్మార్క్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌గా భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిలిచింది. అక్టోబర్ 21న జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన తైజు యింగ్ చేతిలో ఓడింది. Persons
Persons

సుజాతకు శక్తి భట్ పురస్కారం

అమెరికాలో స్థిరపడిన తెలంగాణ దళిత రచయిత్రి సుజాత గిడ్లకు ఈ ఏడాది శక్తి భట్ తొలి రచన పురస్కారం లభించింది. ఆమె రచించిన యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్: యాన్ అన్‌టచబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది.

ఎన్‌డీ తివారీ మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణ్ దత్ తివారీ అక్టోబర్ 18న మృతిచెందారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 1925, అక్టోబర్ 18న జన్మించారు. 1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. ఉత్తరాఖండ్, యూపీ రెండు రాష్ర్టాలకు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు.

అన్నా బర్న్స్‌కు మ్యాన్ బుకర్ ప్రైజ్

ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకమైన మ్యాన్ బుకర్ ప్రైజ్-2018ను ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్ అక్టోబర్ 16న అందుకున్నారు. ఆమె రచించిన మిల్క్ మ్యాన్ నవలకు ఈ అవార్డు దక్కింది. మ్యాన్ బుకర్ ప్రైజ్ చరిత్రలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

సంగీత కళాకారిణి అన్నపూర్ణ మృతి

ప్రముఖ హిందుస్థానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణాదేవి ముంబైలో అక్టోబర్ 13న మృతిచెందారు. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్‌లో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు రోషనారా ఖాన్ కాగా.. మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరు స్థిరపడింది.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అలెన్ మృతి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచపు అత్యంత ధనికుల్లో ఒకరైన పాల్ అలెన్ అక్టోబర్ 16న మృతిచెందారు. మైక్రోసాఫ్ట్ మరో సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అలెన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. 1975, ఏప్రిల్ 4న ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు.

భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్

భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్‌కు ఐన్‌స్టీన్ ప్రైజ్-2018 అందించనున్నట్లు అమెరికన్ ఫిజికల్ సొసైటీ అక్టోబర్ 15న ప్రకటించింది. ఆయన లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. అక్టోబర్ 23న జరుగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో ప్రైజ్‌తో పాటు 10 వేల డాలర్ల నగదు ప్రోత్సాహకాన్ని ఆయన అందుకోనున్నారు.
IF YOU LIKE THIS POST PLEASE Share >>

విపత్తు.. నిర్వహణ

విపత్తు

- నిర్వచనం: మానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను విపత్తు అంటారు.
- విపత్తులు సంభవించడానికి భౌగోళిక వాతావరణ విపత్తులతోపాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణమవుతున్నాయి.
- ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పులవల్ల విపత్తులు సంభవిస్తున్నాయి.
- ఈ మార్పులకు కారణం కాలుష్యం పెరిగిపోవడం, జీవ వైవిధ్యత దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం.
- Nature protects if she is protected కాబట్టి ప్రకృతిని రక్షిస్తే అది మనలను కాపాడుతుంది.
- ప్రకృతిని అనుసరించాలే కాని శాసించకూడదు. అప్పుడే తీవ్రతను చాలావరకు తగ్గించే అవకాశం ఉంది.

నిర్వచనాలు

విపత్తు నిర్వహణ చట్టం-2005 నిర్వచనం

- ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రకృతి/ మానవ తప్పిదాల వల్ల/ ప్రమాదవశాత్తు వల్ల/ నిర్లక్ష్యం వల్లగాని తనంతతానుగా కొలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి, మానవ జీవితానికి, ఆస్తి విధ్వంసం/ నష్టానికి, పర్యావరణ నష్టానికి కారణమయ్యే ఉపద్రవం/ ప్రమాదం/ దుర్ఘటనలనే విపత్తు అని పిలుస్తారు.

ఐక్యరాజ్యసమితి నిర్వచనం

- సమాజపు/ కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలను అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా/ తీవ్రంగా సంభవించే ఆపదను విపత్త్తు అంటారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచనం

- ఏదైనా ప్రదేశంలోని సమూహానికి వెలుపల నుంచి సహా యం పొందాల్సినంత తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని, పర్యావరణ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని, ఆరోగ్య సమస్యలను కలుగజేసే సంఘటనే విపత్తు అంటారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్వచనం

- సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను/ పర్యావరణాన్ని రక్షించి సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితినే విపత్తు అంటారు.

విపత్తు సంస్థాగత చట్టం

- విపత్తులు మానవజాతికి కొత్త కాదు. విపత్తులు చారిత్రక పూర్వపుయుగం నుంచి మానవజాతితో సహజీవనం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులకు సంబంధించి రికార్డు నమోదు క్రీ.పూ. 430 నుంచి ప్రారంభమైనది. మొదటగా ఏథెన్స్‌లో టైపస్‌వ్యాధితో రికార్డు నమోదు ప్రారంభమైంది.
- 1900, 1905, 1907, 1947ల్లో వచ్చిన వరుస దుర్భిక్షాలు, 1937లో సంభవించిన బిహార్, నేపాల్ భూకంపం మొదలైన వాటితో భారతదేశపు విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్ వారికాలంలో ప్రారంభమైంది.
- బ్రిటిష్ పరిపాలనలో విపత్తువల్ల వచ్చే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పునరావాస విభాగాలను ఏర్పాటు చేసేవారు. ఈ విభాగాలు విపత్తు అనంతర పరిస్థితుల్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టేవి.
- స్వాతంత్య్ర అనంతరం విపత్తుల నిర్వహణ బాధ్యత ప్రతి రాష్ట్రంలో ఉండే పునరావాస కమిషనర్లు, కేంద్రంలో కేంద్ర రిలీఫ్ (పునరావాస) కమిషనర్లు నిర్వహించేవారు.
- ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1990వ దశకాన్ని అంతర్జాతీయ, విపత్తు సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ప్రకటించింది.
- 1990 తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద విపత్తు నిర్వహణ సెల్‌ను ఏర్పాటు చేయడంతో ఒక శాశ్వత, వ్యవస్థాగతమైన ఏర్పాటు ప్రారంభమైంది.
ramesh1
- తదనంతరం భారత్‌లో సంభవించిన విపత్తులను అనుసరించి అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జేసీ పంత్ చైర్మన్‌గా విపత్తుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు అత్యున్నతాధికార కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. దీనిననుసరించి భారత్‌లో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడింది.

భారత్‌లో విపత్తు నిర్వహణ నిర్మాణం

- విపత్తు నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో శాసన నిర్మాణ అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్న అన్ని పార్టీల సమావేశం 2005, జనవరి 9న జరిగింది.
- విపత్తు నిర్వహణ బిల్లును రాజ్యసభలో మొదటిసారిగా 2005, మే 11న ప్రవేశపెట్టారు.

విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం..

1. కేంద్రంలో- జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)ను,
2. రాష్ట్రంలో- రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎంఏ)ను,
3. జిల్లా స్థాయిలో- జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ)ను ఏర్పాటు చేశారు.
4. రోండో పరిపాలన సంస్కరణల సంఘం సిఫారసుతో
73, 74వ రాజ్యాంగ సవరణలతో పట్టణ, గ్రామీణ స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థలు ఏర్పడ్డాయి.
- గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్‌లలో కార్పొరేషన్ మేయర్ విపత్తు నిర్వహణకు బాధ్యత వహిస్తారు.

కేంద్రస్థాయి సంస్థలు ఎన్‌డీఎంఏ

- జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ-ఎన్‌డీఎంఏ) ప్రధానమంత్రి అధ్యక్షతన 2005, మే 30న ఏర్పాటు చేశారు. ఇది 2005, డిసెబర్ 23 నుంచి అమల్లోకి వచ్చింది.
- ఈ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం ఎన్‌డీఎంఏను 2006, సెప్టెంబర్ 27న ప్రధాన మంత్రి అధ్యక్షతన మరో 9 మంది సభ్యులతో (నామినేటెడ్) ఏర్పాటు చేశారు. ఈ సభ్యుల్లో ఒకరు వైస్‌చైర్మన్‌గా ఉంటారు. వీరితోపాటు ఒక కార్యదర్శి, ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, 10 మంది సంయుక్త అడ్వైజర్లు, డైరెక్టర్లు, 14 మంది అసిస్టెంట్ అడ్వైజర్లు, అండర్ సెక్రటరీలు ఉంటారు.
- ఈ చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం 12 మంది సభ్యులతో 2007లో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
- ఎన్‌డీఎంఏకు విధుల నిర్వహణలో సహకరించేందుకు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 8 కింద జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు.
- దీనికి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా హోం శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ది, తాగునీటి సరఫరా, సాగునీటి వనరులు, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష శాఖ, అణుశక్తి మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఇతర సభ్యులుగా చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఢిఫెన్స్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఉంటారు. - విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఎన్‌ఈసీ (జాతీయ కార్యనిర్వాహక కమిటీ)కి విపత్తు నిర్వహణలోని...
- జాతీయ ప్రణాళిక రూపకల్పన
- జాతీయ విధాన అమలు
- పర్యవేక్షణ మొదలైన వాటికి సమన్వయ సంస్థగా వ్యవహరించే బాధ్యతను ఎన్‌ఈసీకి అప్పగించారు.
- జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ చట్టం- 2005 ప్రకారం.... జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (ఎన్‌ఐడీఎం), జాతీయ విపత్తు ప్రతిస్పదన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేశారు.

ఎన్‌ఐడీఎం

- నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా 2006, అక్టోబర్ 16న మార్చారు.
- విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఎన్‌ఐడీఎం చట్టబద్ధమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- ఈ చట్టంలోని 7వ అధ్యాయం సెక్షన్-2 ప్రకారం ఎన్‌ఐడీఎంకు అసంఖ్యాక బాధ్యతలను అప్పగించారు. అవి.. 1. శిక్షణ నమూనాలను అభివృద్ధిపరచడం
2. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం
3. పరిశోధనలు చేపట్టడం
4. డాక్యుమెంటేషన్లను చేపట్టడం
5. సదస్సులు, ఉపన్యాసాలు, సెమినార్లు నిర్వహించడం
6. పుస్తకాలు, పరిశోధనా పత్రాల ప్రచురణ చేపట్టడం
- సెక్షన్ 42(4)లోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2007, మే 3న 14 మందితో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది.

ఎన్‌డీఆర్‌ఎఫ్

- విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 44 కింద 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశారు.
- ఈ దళాలను విపత్తులు వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి రూపుదిద్దారు. అవి...1. సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం)
2. బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతాదళం)
3. సీఆర్‌పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీసు దళం)
4. ఐటీబీపీ (ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు)
- ఒక్కో దళాన్ని రెండుగా చేసి వాటిని 12 బెటాలియన్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి బెటాలియన్‌లో 1000 మంది ఉంటారు.
- సహజ, మానవకారక విపత్తులపై ప్రత్యేక శిక్షణ పొందిన 144 బృందాలు ఈ బెటాలియన్లలో ఉన్నాయి. ఇందులో 72 బృందాలను ప్రకృతి వైపరీత్యాలతో పాటు బయాలాజికల్, రసాయన, రేడియో ధార్మిక, అణు వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఉద్దేశించారు.

డీడీఎంఏ సభ్యులు

1. జిల్లా అథారిటీ సీఈఓ
2. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)
3. జిల్లా వైద్యాధికారి
4. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన జిల్లా స్థాయి ర్యాంక్ అధికారులు

డీడీఎంఏ బాధ్యతలు

1. జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక తయారుచేయడం
2. సమన్వయం చేయడం
3. విపత్తు నిర్వహణ అమలు

ఇతర బాధ్యతలు

1. భద్రతా ప్రమాణాలకు పటిష్టంగా అమలుచేయడం
2. నిర్మాణాలను పరిశీలించడం
3. పునరావాస చర్యలను చేపట్టడం
IF YOU LIKE THIS POST PLEASE Share >>

Indian Economy

1. Which of the following has become the first Regional Rural Bank issuing debit cards in the country?

1) Punjab Gramina Bank
2) Nainital/Almora RRB
3) Kashi Gomti samyut Gramin Bank
4) Barod RRB

2. What percentage of central taxes was recommended by the 13th Finance commission to be transfered to states?

1) 28.5%
2) 29.5%
3) 32%
4) 31.5%

3. Which organisation is meant to ensure exports from India?

1) Exim Bank
2) ECGC
3) Ministry of commerce
4) None

4. NABARD was established on the recommendation of?


1) Public account committee
2) Shivaraman committee
3) Narsimham committee
4) Nareeman committee

5. The financial year for banks is April-March but what is the financial year for RBI?

1) January to December
2) April to March
3) October to September
4) July to June

6. Note issuing deptt. Of RBI should always posses the minimum gold stock of worth?

1) Rs. 85 crore
2) Rs. 115 crore
3) Rs. 200 crore
4) Rs. 215 crore

7. Which statement of the following is true for IMF?

1) It is not an agency of UNO
2) It can grant loan to any country of the world
3) It can grant loan only to state govt. Of a country
4) It grants loan only to member nations

8. Which of the following is public sector organisation?

1) FCI- Food corporation of India
2) FCI- Fertilizer corporation of India
3) Cotton corporation of India
4) Jute corporation of India

9. The cause of deflation is?

1) Lack of goods & services as compared to money supply
2) Lack of imports as compared to exports
3) Lack of money supply as compared to supply of goods and services
4) None of the above

10. Pure Banking, Nothing Else is a slogan raised by?

1) ICICI Bank
2) HDFC Bank
3) SBI Bank
4) UTI Bank

11. Devolution means?

1) To reduce the value of home currency in the currency
2) To appreciate the value of home currency
3) To issue new currency in place of old currency
4) None of the above

12. Recently government allowed FDI in Multi brand retail and capped at?

1) 27 %
2) 49 %
3) 51%
4) 74 %

13. Which country has decided to completely ban the sale of petrol & diesel cars by 2040?

1) America
2) Britain
3) France
4) Japan

14. What are Blue chip companies?

1) companies which business in fisheries sectors
2) A Blue chip company is very strong financially
3) High risk startups
4) A company manufacturing memory card

15. Which bank received scheduled bank status from reserve bank of india in February 2017?

1) Equitas small finance Bank
2) Ujjivan small finance Bank
3) Janalakshmi small finance Bank
4) Suryodaya small finance Bank

16. Who is the Vice- Chairman of NITI AYOG?

1) Hasmukh adhie
2) Rajiv shukla
3) Arvind Panagaria
4) Rajiv kumar

17. What is TEZ?

1) Ticket Booking APP
2) Train status tracking APP
3) Digital payment APP
4) Indian post APP

18. Dalal street is situated at?

1) London
2) Paris
3) Mumbai
4) New Delhi

19. Government has issued an audience announcing ULIPS as Insurance Product. The regulations of ULIPs Will now be done by ?

1) SEBI only
2) IRDA only
3) Both SEBI and IRDA
4) Government IfCEs

20. MRTP is related to?

1) Monopolies and Restrictive Trade practices
2) Inflation control
3) Transport control
4) Foreign Exchange Regulations

21. The process of budget making after re-evaluating every item of expenditure in every financial year is Known as ?

1) Performance Budgeting
2) Deficit Budgeting
3) Zero based Budgeting
4) Fresh Budgeting

22. For National Manufacturing and Investment Zone (NMIZ), Special Economic zone (SEZ) and EOUs (Exports oriented Units), Which of the following statement is true?

1) NMIZs and EOUs will be located with in SEZs
2) SEZs and EOUs will be located with in NMIZ
3) NMIZs are independent of SEZs and EOUs
4) NMIZs and SEZs will be competitors in nature

23. UNs world Population prospects 2012 report projects world population in 2050 at?

1) 8.9 billion
2) 9.2 billion
3) 9.6 billion
4) 10.2 billion

24. What is Hawala?

1) Full details of a subject
2) Tax evasion
3) Illegal transactions of foreign exchange
4) Illegal trading of shares

25. Which committee was constituted for reforms in tax - structure?

1) Narsimham committee
2) Gadgil committee
3) Chelliah committee
4) Kelkar committee

26. What is the base year of newly introduced Consumer price Index (CPI)?

1) 2000
2) 2010
3) 2011
4) 2012

27. Which is true for existing Economic and Industrial Polices of Indian Govt.?

a. FERA was abolished
b. MRTP was abolished
c. Cash compensatory support for exports was abolished
d. Industrial Licensing was abolished
1) a, b, c and d
2) a, c and d
3) c and d
4) b and d

28. Kisan credit card scheme was launched on the recommendations of ?

1) Working Group under the chairmanship of TM Bhasin
2) High powered committee under the chairmanship of C Rangarajan
3) Expert committee under the chairmanship of Vimal jalan
4) B Shivaraman committee

29. The term Fat cat Thursday is associated with?

1) Salaries of CEO of the companies
2) Carried interest
3) Profit of Fortune 500 companies
4) salaries of members of Parliament

30. Which sport celebrity says PNB Mera Apna Bank?

1) Pankaj advani
2) PV Sindhu
3) Virat kohli
4) Rohit sharma

31. Which day is celebrated as National Excise Duty Day?

1) 26th January
2) 24th February
3) 14th April
4) 10th June

32. Air Deccan has been re-named as?

1) King fisher Red
2) Jet Red
3) Sahara Red
4) Indigo Red

33. Which of the following is not a Maharathna status having company?

1) Coal India Ltd
2) SAIL
3) ONGC
4) BHEL

34. Closed Economy is that economy in which?

1) Only export takes place
2) Money supply is fully controlled
3) Deficit financing takes place
4) Neither export nor import takes place

35. The headquarters of work bank is situated at?

1) Manila
2) Washington D.C.
3) New York
4) Geneva

36. Which pair is not correct?

1) Exim Bank- Financing for export import
2) IDBI- Industrial finance
3) RBI- Bankers bank
4) FCI- Financial assistance to commercial institutions

37. Which tax is collected by Panchayat?

1) Sales Tax
2) Custom duty
3) Land Revenue
4) Tax on local fairs

38. SEBI has reduced the process duration time limit of Right Issues from 109 dyas to?

1) 89 days
2) 72 days
3) 62 days
4) 43 days

39. The nationalisation of the major commercial banks took place in?

1) 1947
2) 1956
3) 1969
4) 1980

40. The headquarters of RBI is in?

1) Delhi
2) Kanpur
3) Mumbai
4) Nasik

41. Open market operation is a part of ?

1) Income Policy
2) Fiscal Policy
3) Credit Policy
4) Labour Policy

42. The regulator of micro finance in India is?

1) Finance Ministry
2) RBI
3) State Bank of India
4) None

43. Which organisation formulates Fiscal Policy in India?

1) Ministry of Finance
2) NITI AYOG
3) RBI
4) SBI

44. In which year Economic liberalisation took place in india?

1) 1985
2) 1989
3) 1991
4) 1993

45. The rate at which RBI gives short term loan to commercial banks is called?

1) Repo Rate
2) Reverse Repo Rate
3) Bank Rate
4) Cash Reserve Rate 46. LIC of India was established in ? 1) 1897
2) 1950
3) 1956
4) 1965

47. Which of the following is not a financial regulator?

1) IRDA
2) PFRDA
3) AMFI
4) SEBI

48. Rs. 20 and above value notes are printed in?

1) Currency note press, Nasik road
2) Bank note press, Dewas
3) Security printing press, Hyderabad
4) All of the above

49. The newly introduced Indian rupee symbol is based on?

1) Roman script
2) Deva nagari script
3) 1, 2
4) None

50. Which part of the divided UTI is working as mutual fund under SEBI rules?

1) UTI-1
2) UTI-2
3) Both 1 & 2
4) None

51. Indian banks have the maximum foreign branches in?

1) Bangladesh
2) England
3) USA
4) Pakistan

52. Which bank is limited to the needs of agriculture and rural finance?

1) SBI
2) IFC
3) NABARD
4) RBI

53. Which of the first subsidiary bank of SBI was merge with State Bank of India?


1) State Bank of Indore
2) State Bank of Patiala
3) State Bank of Hyderabad
4) State Bank of Saurastra
Ans
IF YOU LIKE THIS POST PLEASE Share >>

LATEST UPDATES

GENERAL KNOWLEDGE

Contact Us

Name

Email *

Message *

FOLLOW BY EMAIL

Subscribe To Get All The Latest Updates!

email updates

Your Visitor Number

Copyright © VINAYS INFO | FACEBOOK | TWITTER | GOOGLE+ | YOUTUBE Design by VINAY KUMAR MUKKANI