Type Here to Get Search Results !

Vinays Info

గోండుపంచ్ (పంచాయితీ), పట్లా (గ్రామ పెద్ద)

  • గోండుపంచ్ (పంచాయితీ), పట్లా (గ్రామ పెద్ద): పంచ్ (పంచాయితీ) కుటుంబాలలో యజమానిగా ఉండే పురుషులతో ఏర్పడిన మండలి.
  • గ్రామానికి చెందిన అంశాలు గ్రామపెద్ద (పట్ల) నిర్ణయించడంలో ఈ గ్రామసభ (మండలి) నిర్ణయమే కీలకం.
  • ఈ గ్రామ పంచాయితీ గోండు సమాజానికి ప్రతిరూపం. ఈ పంచాయితీ సమావేశాలు క్రమం తప్పకుండా జరగవు. అవసరమైనప్పుడు మాత్రమే జరుగుతాయి.
  • ఈ పంచాయితీ సమావేశం జరిగేటప్పుడు మగవారందరూ హాజరవుతారు. యువకులు, మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు.
  • ఆడవారికి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు. అయితే వారి సమస్యలు విన్నవించుకోవచ్చు.
  • ప్రధాన పండుగల తేదీలు, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారం, కర్మకాండలు మొదలైన వాటికి సంబంధించిన విధులను పంచ్ (పంచాయితీ) నిర్వహిస్తుంది.
  • గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచ్లు (పంచాయితీలు) సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section