ఏవ్స్ విభాగంలో ఈకలు గల ద్విపాదులైన పక్షులను చేర్చారు.
పక్షుల్లో జీవక్రియారేటు, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
అంతరోష్ణ జీవులవడం వల్ల పక్షులు రాత్రివేళల్లో చల్లని వాతావరణంలో చురుకుగా ఉంటాయి.
పక్షులు దూర ప్రాంతాలకు వలస వెళ్లగలుగుతాయి.
పక్షులు థెరాపోడ్, డైనోసార్‌ల నుంచి జురాసిక్ యుగంలో ఉద్భవించి క్రిటేషియన్ యుగంలో ఆధునీకరణ చెందాయి.
టీహెచ్. హక్స్‌లే పక్షులను ‘దివ్యమైన సరీసృపాలు’గా అభివర్ణించాడు. జేజడ్.యంగ్ ‘మాస్టర్ ఆఫ్ ఎయిర్’గా పేర్కొన్నాడు.
పక్షుల సాధారణ లక్షణాలు
ఇవి ఉష్ణ రక్త జీవులు. దేహం పడవ ఆకారంలో కుదించినట్లు ఉంటుంది.
ఇవి ద్విపాదులు. పూర్వాంగాలు రెక్కలుగా రూపాంతరం చెంది ఉంటాయి.
చర్మం పొడిగా ఉంటుంది. చర్మంలో ఒకేఒక పెద్ద గ్రంథి తోక ఆధారంలో ఉండే యూరోపైజియల్ లేదా ప్రీన్ గ్రంథి. పక్షి దీని నుంచి ముక్కుతో తైలాన్ని గ్రహించి ఈకలను బాగుచేసుకుంటుంది.
చాలా ఎముకలు వాతిలాస్థులు. ఇవి వాయుకోశాల విస్తరణను కలిగి ఉంటాయి.
మహారసి కండరాల వల్ల రెక్క కిందికి కొట్టుకుంటుంది. సూప్రా కోరకాయిడిస్ వల్ల రెక్క పైకి కొట్టుకుంటుంది.
పక్షుల రెక్కల్లోని ఎముకల్లో వాయువు నిండి ఉండటం వల్ల ఆకాశంలో ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది.
సాధారణంగా ఎగిరే పక్షుల కంటే ఎగిరే పక్షుల శరీరం బరువుగా ఉంటుంది.
శరీర బరువు తక్కువగా ఉండటం కూడా ఎగిరే పక్షులకు అనుకూలనం.
జీవించి ఉన్న పక్షుల్లో దంతాలుండవు. ఆహారవాహిక తరచూ ఆహారాన్ని నిల్వచేసే అన్నాశయంగా విస్తరించి ఉంటుంది.
ఊపిరితిత్తులు స్పంజికలుగా ఉంటాయి. వాయుగోణులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
రెండు కర్ణికలు, రెండు జఠరికలతో కూడిన నాలుగు గదుల హృదయం ఉంటుంది.
పక్షుల హృదయంలో సిరాసరణి అభివృద్ధి చెంది ఉంటుంది.
క్రియాత్మక మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మూత్రాశయం ఉండదు. (ఆస్ట్రిచ్‌లో తప్ప)
మెదడును ఆవరించి వరాశిక, మృద్వి, లౌతికళ మూడు మెనింజెస్ ఉంటాయి.
12 జతల కపాల నాడులు ఉంటాయి.
పక్షుల కళ్లు పెద్దవిగా, నిమేషక పటలంతో ఆవరించి ఉంటాయి. కంటిలో దువ్వెన వంటి పెక్టిన్ ఉంటుంది.
అంతర ఫలదీకరణం జరుగుతుంది. పక్షులన్నీ అండోత్పాదకాలు. గుడ్లు క్లీడాయిక్ రకానికి చెందినవి.
బవేరియా (జర్మనీ)లోని ఉన్నత జురాసిక్ శిలల్లో ఆర్కియోప్టరిక్స్ లిథోగ్రాఫికా శిలాజాలను కనుగొన్నారు. ఇది సరీసృపాలు, పక్షుల లక్షణాలను ప్రదర్శిస్తుంది. కాబట్టి దీన్ని సరీసృపాలకు, పక్షులకు మధ్య సంధాన సేతువుగా పరిగణిస్తారు.
చాలా పక్షులు వలస చూపుతాయి.
ఆహారం, ఆవాసం, ప్రత్యుత్పత్తి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళతాయి.
ఉదా: సైబీరియా దేశం నుంచి ఫిబ్రవరి నెలలో సైబీరియన్ కొంగలు భారతదేశానికి వలస వస్తాయి. మళ్లీ జూలై-ఆగస్టు నెలల్లో తిరిగి వెళతాయి.
పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు.
ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త సలీం అలీని ‘ఇండియన్ బర్డ్ మ్యాన్’ అంటారు.
అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవాన్ని ఏటా మే 4న నిర్వహిస్తారు.
అతిచిన్న ఎగరలేని పక్షి- కివి (న్యూజిలాండ్ జాతీయ పక్షి)
అతిపెద్ద గుడ్లు పెట్టే ఎగరలేని పక్షి- ఆస్ట్రిచ్
నిలబడి గుడ్డుపెట్టే పక్షి- పెంగ్విన్
పైదవడ కలిగిన ఏకైక పక్షి- రామచిలుక
అత్యధిక దూరం ప్రయాణించే పక్షి- ఆర్కిటిక్ టెర్న్
అతివేగంగా ఎగిరే పక్షి- స్విఫ్ట్ (జపాన్)
అతిపెద్ద రెక్కలు కలిగిన సముద్ర పక్షి- అల్‌బట్రోస్
ముందుకు, వెనుకకు ఎగిరే అతిచిన్న పక్షి- హమ్మింగ్
ఇండియాలో అంతరించే దశలో ఉన్న అతిపెద్ద పక్షి- బట్టమేక పిట్ట