Type Here to Get Search Results !

Vinays Info

పట్టు సంవర్ధనం(Sericulture)

పట్టు సంవర్ధనం(Sericulture)

  • వాణిజ్యపరంగా పట్టు ఉత్పత్తి కోసం చేపట్టే పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్‌ లేదా పట్టు పరిశ్రమ అంటారు.
  • పట్టుపురుగు శాస్త్రీయ నామం- బాంబిక్స్‌ మోరి
  • పట్టు పురుగులు మల్బరీ ఆకులను తింటాయి.
  • పట్టు మాత్‌ గొంగళి పురుగు. దీని లాలాజల గ్రంథులు పట్టు గ్రంథులుగా మారి పట్టును ఉత్పత్తి చేస్తాయి.
  • గొంగళి పురుగులు (కాటర్‌ పిల్లర్స్‌) ఒక నెల రోజుల్లో మల్బరీ ఆకులను విపరీతంగా తిని పెరిగి నాలుగుసార్లు నిర్మోచనం జరుపుకొంటాయి.
  • పెరగడం పూర్తయ్యాక గొంగళి పురుగు ఆహారం తీసుకోవడం మాని, శరీరం చుట్టూ పట్టుదారాలతో ఒక కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని పట్టుగూడు లేదా కొకూన్‌ అంటారు.
  • ఈ దశనే ప్యూపా దశ అంటారు.
  • పూర్తిగా ఏర్పడిన తర్వాత వాటిని మరుగుతున్న నీటిలో ఉంచుతారు. దీని వల్ల లోపల ఉన్న గొంగళి పురుగు చనిపోతుంది.
  • గొంగళి పురుగును చంపకపోతే అది మాత్‌గా రూపవిక్రియ చెంది కొకూన్‌ను చీల్చుకొని వెలుపలకు వస్తుంది. దీని వల్ల పట్టుదారం ముక్కలై వ్యాపార రీత్యా ఉపయోగపడదు.
  • కొకూన్లను పట్టుకోవడం రీలింగ్‌ యూనిట్లకు పంపుతారు. పట్టుకోసం కొకూన్ల నుంచి దారాన్ని తీయడాన్ని రీలింగ్‌ అంటారు.
  • పట్టుదారంలో ఫైబ్రోయింగ్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది.
  • పట్టులో మల్బరి పట్టుగాక టసార్‌, ఈరీ, మూంగా అనే పట్టు రకాలున్నాయి. ఇవి చాలా చవకైనవి. (నాణ్యమైనవి కావు)
  • పట్టును దుస్తుల తయారీలోనే గాక, గాలి గుమ్మటాలు, బెలూన్‌లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
  • పట్టు పరిశ్రమలో ముఖ్యంగా లార్వాలకు వైరస్‌, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పెబ్రయిన్‌ అనే ఏకకణ జీవి వల్ల వ్యాధులు సంక్రమిస్తాయి. యూజి అనే ఈగ వల్ల కూడా పట్టు పురుగులకు ప్రమాదం కలగవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section