Type Here to Get Search Results !

Vinays Info

తేనెటీగలు(Apiculture)

 తేనెటీగలు(Apiculture)

  • తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని ఎపికల్చర్‌ అంటారు.
  • భారతదేశంలో కనిపించే తేనెటీగ శాస్త్రీయ నామాలు- ఎపిస్‌ ఇండికా, ఎపిస్‌ డార్సెట
  • తేనెటీగలు సాంఘిక జీవులు. ఒక తేనెపట్టులో 50,000 తేనెటీగలుంటాయి.
  • మొత్తం తేనె పట్టులో ఒక రాణి ఈగ, డ్రోన్‌లు, కూలీ ఈగలు ఉంటాయి.
  • రాణి ఈగ ఒకటే ఉంటుంది. డ్రోన్‌లు సుమారు 200-300 వరకు ఉంటాయి.
  • కూలీ ఈగలు 20,000-60,000 వరకు ఉంటాయి.
  • తేనె ఎంతో విలువైన పోషక పదార్థం. దీనిలో లెవులోజ్‌, డెక్ట్రోజ్‌, మాల్టోజ్‌ వంటి చక్కెరలుంటాయి.
  • ఇది మంచి యాంటీసెప్టిక్‌ పదార్థం.
  • దీన్ని ఆయుర్వేద, యునాని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
  • తేనెపట్టు నుంచి వచ్చే మైనాన్ని కొవ్వొత్తులు, పాలిష్‌ తయారీలో ఉపయోగిస్తారు.
  • తేనెటీగల విష గ్రంథుల నుంచి సేకరించిన విషాన్ని కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్‌) నివారణలో ఉపయోగిస్తారు.
  • వాక్స్‌మాత్‌ అనే కీటకం తేనె పట్టులోని మైనం తిని, పట్టులోని గదులను నాశనం చేస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section