క్షీరదాలు(Mammals)
➤అధిక ఉష్ణోగ్రతను స్థిరంగా నియంత్రించడం క్షీరదాల లక్షణం. బాహ్యంగా రోమాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేక లక్షణం. రోమాలు, క్షీరగ్రంథులు, స్వేద గ్రంథులు, చర్మావస గ్రంథులు క్షీరదాల్లో మాత్రమే ఉంటాయి. సీనోజాయిక్ యుగాన్ని క్షీరదాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. క్షీరదాల అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు.
➤ సజీవ క్షీరదాలను మూడు ప్రధానమైన క్రమాలుగా గుర్తించారు. అవి మోనోట్రిమ్‌లు, మార్సుపియల్‌లు, యూథీరియన్లు.
➤ నీలి తిమింగలం (బెలనోప్టిరా మస్కులస్)- అతిపెద్ద క్షీరదం
➤ పిగ్మీ ఘ్రా- అతిచిన్న క్షీరదం క్షీరదాల సాధారణ లక్షణాలు
➤ ఇవి ఉష్ణ రక్త జీవులు. బాహ్య చర్మం నుంచి ఏర్పడే రోమాలుంటాయి. తిమింగలాలు, ఆర్మాడిల్లోలో రోమాలు క్షీణించి ఉంటాయి.
➤ చర్మంలోని స్వేద గ్రంథులు విసర్జనకు, ఉష్ణోగ్రతా క్రమతకు సహాయపడతాయి. క్షీర గ్రంథులు రూపాంతరం చెందిన స్వేద గ్రంథులు.
➤ థీకోడాంట్ దంత విన్యాసం, ద్వివార, విషమ దంతి రకపు దంతాలు ఉంటాయి.
➤ రెండు కర్ణికలు, రెండు జఠరికలతో నాలుగు గదులు గల హృదయం ఉంటుంది. పుపుస శ్వాసక్రియ జరుగుతుంది.
➤ క్రియాత్మక మూత్రపిండాలు అంత్య వృక్క రకానికి చెందినవి.
➤ వరాశిక, లౌతికళ, మృద్వి అనే మూడు మెనింజస్ ఉంటాయి.
➤ ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు కంగారూ. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. కాబట్టి ఆస్ట్రేలియాను శిశుకోశ క్షీరదాల భూమి అంటారు.
➤ మానవుల్లో కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు ఉంటాయి.
➤ మానవుడి దంత సూత్రం= 2123/2123
➤ జలచర క్షీరదాల అధ్యయనాన్ని సీటాలజీ అంటారు.
➤ గుడ్లు పెట్టే క్షీరదం ఎకిడ్నా దీన్నే ‘స్పైన్ ఆంట్ ఈటర్’ అంటారు.
➤ ఆడ, మగ జీవులు పాలిచ్చే క్షీరదం డక్‌బిల్డ్ ప్లాటిపస్.
➤ ఎక్కువ దంతాలు కలిగి, తక్కువ గర్భావధి కాలం గల క్షీరదం- అపోజం
➤ సముద్రానికి ఆనకట్టలు కట్టే క్షీరదం- బీవర్
➤ అతిపెద్ద భూచర జంతువు- ఏనుగు
➤అతివేగంగా పరిగెత్తే జంతువు -చిరుతపులి
➤ఎగిరే క్షీరదం- గబ్బిలం
➤నేలపై నివసించే క్షీరదాలు
➤వీటిలో నాలుగు చెవులు, నాలుగు చలనాంగాలు ఉంటాయి.
➤రెండు పూర్వాంగాలు, రెండు చరమాంగాలు ఉంటాయి.
మార్సూపియల్స్: పిల్లలను సంరక్షించుకోవడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది.
ఉదా: మాక్రోపస్ (కంగారూ)
రోడెంట్స్: దవడలు కలిగి ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఉలిగా ఉపయోగించుకుంటాయి. కఠిన ఆహార పదార్థాలను సులువుగా తింటాయి.
ఉదా: ఎలుక (రాటస్)
ప్రైమేట్స్: అభివృద్ధి చెందిన చేతులు, కాళ్లు కలిగి ఉంటాయి. వేళ్లకు గోళ్లు ఉంటాయి. తెలివైన జీవులు. సంఘ జీవులు. కుటుంబం, స్నేహితులతో బంధం ఏర్పరుచుకుంటాయి.
ఉదా: కోతి (మాకాక)
సముద్ర క్షీరదాలు
- ఇవి సముద్రపు నీటిలో పెరుగుతాయి.
- సముద్రపు నీటిలోనే పిల్లల్ని కంటాయి.
- కొన్నింటికి మాత్రమే రోమాలుంటాయి.
- మిగతా వాటిలో చేప వలె చర్మం కలిగి ఉంటాయి. ఉదా: డాల్ఫిన్ (డెల్ఫినస్)
- ఎగిరే క్షీరదాలు
- ప్రతి ధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్ధేశించుకుంటాయి.
- ఇవి నిశాచరులు. చెట్ల తొర్రల్లో, గుహల్లో నివాసాలు ఏర్పరుచుకుని నివసిస్తాయి.
- ఉదా: గబ్బిలం (టారోపస్)