Type Here to Get Search Results !

Vinays Info

ఆడుకుందాం!(Lets Play)

ఆడుకుందాం!(Lets Play)

మస్తాన్, రహీం, లత, కమల, జాని, గిరి ఆటలాడడానికి మైదానానికి వెళ్లారు.'అక్కడ ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్లంతా రకరకాల ఆటలు ఆడుతున్నారు.

ఆటలు(Games)

  • ఆదివారంనాడు గిరి ఇంట్లోనే వాళ్ల అక్కతో, చెల్లితో రకరకాల ఆటలు ఆడాడు. 
  • మస్తాన్ తన స్నేహితులతో కలిసి ఆటస్థలంలో రకరకాల ఆటలు ఆడాడు.

రకరకాల - ఆటలు(Types of Games)

  • వీటిలో కొన్నింటిని ఒక్కరే ఆడుతుంటారు.
  • మరికొన్ని ఆటలను తోటివారితో కలిసి ఆడుతారు. 
  • ఇంకా కొన్ని ఆటలను ఎక్కువమంది కలిసి ఆడుతారు.

ఆటవస్తువులు(Games Materials)

  • శ్వేత, నిఖిల్, సల్మా, అజిత్, మేరీ, సంకల్ప్ సాయంత్రం క్రికెట్ ఆడుకోడానికి వెళ్లారు. 
  • ఇందుకోసం బ్యాటు, బంతి, వికెట్లను తమ వెంట తీసుకొని వెళ్లారు. ఇలా మీరు ఆడుకునే కొన్ని ఆటలకు ఆటవస్తువులు కావాలి.
  •  అలాగే కొన్ని ఆటలు ఆడడానికి ఆటవస్తువులు అవసరం లేదు. దాగుడుమూతలు ఆడడానికి ఎలాంటి ఆటవస్తువులు అవసరం లేదు.

ఆటలు - నియమాలు(Games and Rules)

  • రాము, జాని, గోపి, ముంతాజ్, శ్రీను,మురళి, శ్రీధర్, పీటర్, జబ్బర్, మస్తాన్ కబడ్డీ ఆడుతున్నారు. 
  • ఆట మధ్యలో అందరూ గొడవపడ్డారు. ఆటలో చేసిన తప్పులమీద గొడవ జరిగింది. ఆట ఆగిపోయింది. 
  • మురళి, జాని, మస్తాన్ ఆట ఆడమని ఇంటికి వెళ్లిపోయారు.
  • ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. 
  • ఆటలు ఆడేటప్పుడు నియమాలను అతిక్రమించరాదు. ఆటలలో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు.
  • కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీచేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు.
  • గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. మనం ప్రతిరోజూ తప్పక ఆటలు ఆడాలి.ఆటలాడితే ఆరోగ్యంగా ఉంటాం. స్నేహితులు పెరుగుతారు. 
  • ఆటలలో నియమాలలో మాదిరిగానే వ్యక్తిగత శరీర భద్రతకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని వ్యక్తిగత శరీర భద్రతా నియమాలుగా పిలుస్తాము.
  • నవంబర్ 14, బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టారు.
  • పరుగుపందెంలో గోపి అందరికన్నా వేగంగా పరుగెత్తి మొదటి బహుమతి పొందాడు.పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు గోపిని అభినందించారు.

• ఆటలు ఆడడంవల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆనందం కలుగుతుంది. స్నేహం పెరుగుతుంది.

• ఆటలు ఎన్నో రకాలు - ఒక్కరే ఆడేవి, జట్లుగా ఆడేవి; ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి.

• ఒకప్పటికీ, నేటికీ ఆటలలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు అనేక కొత్త ఆటలు వచ్చాయి.

• కొన్ని ఆటలు ఆడడానికి ఆటవస్తువులు అవసరం. కొన్నిటికి అవసరం లేదు.

• ఆటలలో గెలుపు- ఓటములను సమానంగా తీసుకోవాలి.

• ఆటలు నియమాల ప్రకారం ఆడాలి. అలాగే వ్యక్తిగత శరీర భద్రత నియమాలు కూడా పాటించాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section