కోళ్ళపరిశ్రమ (Poultry)
అధిక మొత్తంలో కోళ్ళను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ళ పరిశ్రమ(Poultry) అంటారు.
ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కోళ్ళను గుడ్లు, మాంసం కోసం పెంచుతున్నారు.
గ్రామాలలో సాధారణంగా రైతులు పశువులతో పాటూ కోళ్ళను కూడా పెంచుతుంటారు. ఇవన్నీ దేశీయ రకాలు (నాటుకోళ్ళు).
మనకు 74% మాంసం, 64%) గుడ్లు కోళ్ళఫారాల నుండి లభిస్తున్నాయి. రెండు దశాబ్దాల నుండి కోళ్ళ పరిశ్రమ ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగింది.
మనదేశంలో సంవత్సరానికి 90 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో(మూడో స్థానాన్ని, మాంసం ఉత్పత్తిలో ఏడవ స్థానాన్ని ఆక్రమించింది.
3000-5000 మిలియన్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతోంది.
కోళ్ళ పెంపక కేంద్రాలు రెండు రకాలుగా ఉంటాయి.
ఒకటి గుడ్ల ఉత్పత్తికి, మరొకటి మాంసం ఉత్పత్తికి చెందినవి. సాధారణంగా కోళ్ళ పరిశ్రమలో బ్రాయిలర్లను పెంచుతారు. వీటిని మాంసం కోసం, లేయర్లను గుడ్ల కోసం పెంచుతారు.
సహజంగా దేశీయ రకాలు పూర్తిగా పెరగడానికి 5-6 నెలలు) పడుతుంది. కానీ బ్రాయిలర్లు 6-8 వారాలలోనే పూర్తిగా పెరుగుతాయి. జన్యు మార్పిడి ద్వారా ఇలాంటి జాతులను ఉత్పత్తి చేస్తారు.
న్యూ హాంప్పైర్, ఫైట్ ప్లే మౌత్,రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, (అనోకా) మాంసానిచ్చే విదేశీజాతులు.
కొన్ని కోళ్ళను కేవలం గుడ్లను పొందడానికి మాత్రమే పెంచుతారు. సాధారణంగా కోళ్ళు వాటి జీవితకాలంలో 300-350 వరకు గుడ్లను పెడతాయి. కాని 21నుండి 72 వారాల పాటూ తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
కొన్ని రోజుల తరువాత గుడ్లు పెట్టే శక్తి కోళ్ళలో తగ్గిపోతుంది. అందుకే చాలా మంది బ్రాయిలర్ కోళ్ళను పెంచడానికి ఇష్టపడతారు.
దేశవాళీ రకాలు పొదగడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అసీల్, కడక్నాథ్,చిత్తాగాంగ్,లాంగ్షాన్, బ్రూసా మొదలైనవి స్వచ్ఛమైన దేశీయ రకాలు, కాని గుడ్లను పెట్టే శక్తి వీటికి తక్కువ.
• ఆసిల్ (బెరస కోడి) భారతీయ దేశీయ కోడి.దీనిని కోడి పందాల కొరకు పెంచుతారు. వీటిలో పోరాడేతత్వం, అధిక శక్తి ఉంటాయి.
మనం గుడ్లు, మాంసం కొరకు కోళ్ళను
పెంచుతాము. స్థానిక కోళ్ళ పెంపకందార్లు రెండు
రకాల కోళ్ళను పెంచుతారు.
ఇంక్యుబేటర్స్ను ఉపయోగించి అందులో గుడ్లను
పొదిగించటం వలన అధిక మొత్తంలో కోడిపిల్లలు
ఉత్పత్తి అవుతాయి. గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైన పని. గ్రామాలలో పొదిగే కాలం రాగానే గంపలో గడ్డిపరిచి దాని మీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చుని గుడ్లను పొదుగుతాయి.
జనవరి -ఏప్రిల్ నెల వరకు గుడ్ల ధరలు అధికంగా
ఉంటాయి. దీనికి గల కారణమేమి? ఈ కాలంలో
గుడ్లను ఎక్కువగా పొదగడానికే ఉపయోగిస్తారు. ఈ
కాలంలో పొదిగే రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ
సమయంలో ఉండే 37-38°C ఉష్ణోగ్రత గుడ్లను
పొదగడానికి అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ
పరిశ్రమలో వెలువడే వ్యర్థపదార్థాల (Litter) ను
వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తారు.
గుడ్లు మంచి పోషకవిలువలు కలిగిన ఆహారం.