ఈమూ పక్షుల పెంపకం(Emu Culture)
- ఈమూ ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి. ఉష్ణపక్షి తర్వాత ఇది అతిపెద్ద పక్షి.
- ఈ అద్భుతమైన పక్షి దాదాపు 50కి.గ్రా. బరువు ఉండి, గంటకు 40 మైళ్ళ వేగంతో పరుగెడుతుంది. కోళ్ళ పెంపకంలాగే ఈమూ పక్షుల పెంపకం కూడా ఆర్థికంగా లాభదాయకం.
- ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లోనూ తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లోనూ ఈ పక్షుల పెంపకం మొదలు పెట్టారు.
- వీటి మాంసం, గుడ్లు, పిల్లలు, చర్మం, తోలు, నూనె, ఈకలు వాణిజ్యవిలువ కలిగినవి కాబట్టి వీటి కోసం పెంచుతారు. వీటి మాంసం, గుడ్లు ఖరీదైనవి.
- ప్రస్తుతం మన రాష్ట్రంలో వీటికి మార్కెటింగ్ సౌకర్యాలు సరిగా లేవు.