Type Here to Get Search Results !

Vinays Info

1. కుటుంబం(Family) - 3rd Class EVS

1. కుటుంబం(Family) - 3rd Class EVS

  • సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ పిల్లలు ఉంటారు.
  • అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు.
  • మరికొన్ని కుటుంబాలలో వాళ్లతోపాటు తాత, నాయనమ్మ లాంటి వృద్ధులు కూడా ఉంటారు.
  • ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యుల్లో కొందరు వేరే చోట ఉంటారు.
  • రమ వాళ్ళ తాతయ్య పేరు రంగయ్య. నాయనమ్మ పేరు గంగమ్మ. రమ వాళ్ళ తాతయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
  • కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను 'వంశవృక్షం' అంటారు.
  • రమ వాళ్ళ చిన్నమ్మకు పాప పుట్టింది. పాపను చూడడానికి బంధువులు వచ్చారు.
  • సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, అత్త, మామ, పెదనాన్న, చిన్నాన్న(కాక), చిన్నమ్మలను పోలి ఉంటారు. 
  • కొందరు పై వారిని ఎవరినీ పోలి ఉండరు. కాబట్టి మన శరీరాకృతిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి, దానిని రక్షించుకోవాలి.
  • కుటుంబంలోని వ్యక్తులు వివిధ గుణాలను కలిగి ఉంటారు. కొన్ని సార్లు మనకు కోపం వచ్చినపుడు
  • ఇతరులను బాధించే పదాలను వాడుతాము. కాని ఇది సమస్యను పరిష్కరించదు. దీనికి బదులుగా మనము ఆ వ్యక్తితో మన కోప కారణం తెలుపుదాం. మనకు నచ్చని ప్రవర్తన లేదా సందర్భం గురించి తెలుపుదాం. మన ఇద్దరికి బాధ కలిగించని పరిష్కారాన్ని సూచిద్దాం.

కుటుంబ చరిత్ర

  • బడిలో చేర్చడానికి రమను వాళ్లనాన్న బడికి తీసుకువచ్చారు. రమ పేరును వాళ్లనాన్న 'చిలుకూరు రమ' అని రాశారు. మా పూర్వీకులు చిలుకూరి నుంచి రావడం వల్ల ఆ పేరు వచ్చిందని రమ వాళ్ల నాన్న చెప్పారు.
  • నా పేరు హసీనా. మా ఇంట్లో మా అమ్మ, నాన్న,అన్నయ్యతో పాటు అవ్వ, తాత ఉంటారు.
  • నా పేరు డేవిడ్. మా ఇంట్లో నేనూ,అమ్మ, నాన్న, అక్క ఉంటాం.
  • నా పేరు శివ. మా ఇంట్లో అమ్మ,నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెదనాన్న,చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్య ఉంటారు.
కళ్లులేనివాళ్లు చదవడంకోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు.ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు.
  • కళ్లు లేనివాళ్లకు, శారీరక వికలాంగులకు, మూగ, చెవిటి వాళ్లకు అవసరమైన సహాయాన్ని అందించాలి. 
  • మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవాళ్లు సైగలద్వారా మాట్లాడుకుంటారు. 
  • వినికిడి సమస్య ఉన్నవాళ్లు చెవిలో మిషన్ పెట్టుకొని, కంటి చూపు సరిగా లేనివాళ్లు చూపుడు కర్రతోను, స్పర్శ ద్వారాను విషయాలను గ్రహిస్తారు. 
  • అలాగే కొంతమంది అనారోగ్యం వల్ల లేదా ప్రమాదంవల్ల తమ పనులు తాము చేసుకోలేరు. అలాంటి వాళ్లకు మనం అవసరమైన సహాయం చేయాలి.
  • ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న "ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం”జరుపుతారు.
  • ప్రతి సంవత్సరం అక్టోబరు 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా “వృద్ధుల దినోత్సవం” జరుపుతారు.
* సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు.
* ఇలా ఒకే కుటుంబంగా కలిసి ఉండేవాళ్లను కుటుంబ సభ్యులు అంటారు.
* అమ్మ, నాన్న, అవ్వ, తాత, వాళ్ల పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షం' అంటారు.
* కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యులు,బంధువుల పోలికలు వస్తాయి.
* అందరి ముఖాలూ ఒకేలా ఉండవు.
* మనకుండే నైపుణ్యాలు, స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాం.
* ప్రతి కుటుంబానికీ ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని 'కుటుంబ చరిత్ర' అంటారు.
* కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలు ఉంటాయి.
* ప్రత్యేక అవసరాలు గల అందరికీ అవసరమైన సహాయం చేయాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section