2. ఎవరేం పని చేస్తారు?
- ఇది కమల ఇల్లు. వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న,తాతయ్య, నాయనమ్మ, తమ్ముడు ఉంటారు.
- కమల తల్లిదండ్రులిద్దరూ తమ ఇంటిపనులలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కమల,ఆమె తమ్ముడు వారి తల్లిదండ్రులకు వివిధ పనులలో సహాయం చేస్తారు.
- కమల అవ్వ, తాతలు కూడా ఇంటిపనులలో సహాయం చేస్తారు. ఈ విధంగా ఇంట్లోని వారందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులను చేస్తారు.
- కుటుంబాలలో పెద్దవాళ్లు ఇంటిపనులతో పాటు బయటిపనులు కూడా చేస్తారు. పొలాల్లో,ఫ్యాక్టరీల్లో,ఇళ్లుకట్టడంలో, రోడ్డువేయడంలో, కార్యాలయాల్లో రకరకాల పనులు చేస్తారు.
- పెద్దలు చేసే వివిధ రకాల పనులవల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది.
- ఒకరికొకరు సహకరించుకోవడం కుటుంబంలోవాళ్లు రకరకాల పనులు చేస్తారు. కుటుంబాల్లోని పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన పని చేస్తారు. కొన్ని పనులను ఇంట్లోవాళ్లంతా కలసి చేస్తారు.
- కుటుంబంలోని వ్యక్తులందరూ కలసిమెలసి పనులు చేసుకోవాలి. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల పనులు చేయడం సులభం అవుతుంది, ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం కలుగుతాయి.
- వృత్తులు కుటుంబంలో అమ్మ, నాన్న, అందరూ రకరకాల పనులు చేయడంవల్ల మన అవసరాలు తీరుతాయి. మన కుటుంబంలోలాగా ఊరిలో కూడా రకరకాల పనులు చేసేవాళ్లు ఉంటారు.
- సమ్మక్క బుట్టలు అల్లుతుంది.
- వెంకన్న చెప్పులు కుడతాడు.
- కొమరయ్య క్షౌరం చేస్తాడు.
- శంకరయ్య కట్టెపని చేస్తాడు.
- రాజయ్య రోడ్లు ఊడవడం, కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తాడు.
- అన్నిపనులూ ముఖ్యమైనవే. ఆదాయంకోసం నైపుణ్యంతో చేసే పనులను 'వృత్తులు) అంటారు.
- అన్ని వృత్తులవాళ్లు గ్రామ అభివృద్ధికి అవసరం. అందుకే అన్ని వృత్తులవాళ్లనూ గౌరవించాలి.
పనిచేసే పిల్లలు
ఈమె కమల. కమలకు బడికి వెళ్లడం చాలా ఇష్టం. కాని ఇప్పుడు.బడికి వెళ్లడం లేదు. ఇంటిదగ్గర చెల్లెల్ని ఎత్తుకొని ఆడిస్తుంది. కమలవాళ్ల నాన్న పొలానికి, అమ్మ కూలిపనికి వెళ్తారు. కమల ఇంటిపని చేస్తూ రోజంతా ఇంటి దగ్గరే ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే తన పుస్తకాలను తీసి చదువుకుంటుంది. బడికి పోయే పిల్లల్ని చూసినప్పుడల్లా కమలకు బడికి వెళ్ళాలనిపిస్తుంది.
తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించాలి. చదువుకోవడం పిల్లల హక్కు కాబట్టి పిల్లలందరూ రోజూ బడికి వెళ్లాలి.
- ఇంట్లో వాళ్లంతా ఇంట్లో, బయట రకరకాల పనులు చేస్తారు.
- కుటుంబంలోని వ్యక్తులందరూ కలసిమెలసి పనులు చేసుకోవాలి.
- పెద్దలు బయట చేసే పనులవల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది.
- ఇంటిపనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి,
- అన్ని వృత్తులవాళ్లనూ గౌరవించాలి.
- గ్రామంలో రకరకాల వృత్తులవాళ్లు ఉంటారు.
- పిల్లలు ఉండవలసినది బడిలో కాని పనిలో కాదు. బడిఈడు పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకోవాలి.