ఆపదలో ఉన్న జంతువుల సమాచారం(Data of Endangered Species)
ప్రపంచ వన్య ప్రాణులసమాఖ్య WWE (World wild life federation), అంతర్జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ సంఘం IUWC (International Union for Wild life Conservation) అంతరించిన, అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. దీనినే రెడ్ డేటా బుక్ (Red data book) లేదా రైడ్ లిస్ట్ బుక్" (Red list book) అంటారు.
“రెడ్ డేటా బుక్” అంతరించి పోతున్న జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవలసిన అవసరాన్ని తెలియజేసే సూచికగా ఉపయోగపడుతుంది.
ఈ జీవులను సంరక్షించుకోనట్లైతే సమీప భవిష్యత్తులోనే అవి అంతరించిపోతాయి.