తొలి యూరోపియన్ల ప్రయత్నాలు - క్రైస్తవ మిషనరీల కృషి
VINAYS INFO
తొలి యూరోపియన్ల ప్రయత్నాలు - క్రైస్తవ మిషనరీల కృషి | Early European Attempts - The Work of Christian Missionaries
క్రీ.శ 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యావిధానం ప్రారంభమయింది. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలతో ప్రారంభమైంది.
భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిషనరీలలో రోమన్ కాథలిక్ మిషన్లు మొట్టమొదటివి.
ఈ మిషనరీలు ప్రపంచంలో వివిధ దేశాలలో తమ మతవ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాయి.
మనదేశంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, డేన్, ఇంగ్లాండువాసులు ఆ విధంగానే క్రైస్తవ మతవ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారు.
యస్.యస్ ముఖర్జీ “భారతదేశంలో ఆధునిక విద్యావిధానానికి ఆద్యులు పోర్చుగీసువారు” అన్నారు.
భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషిచేసిన మొట్టమొదటి మతబోధకుడు పోర్చుగీసుకు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను కాలినడకన గ్రామాలలో పయనించి క్రైస్తవ మతానికి చెందిన గ్రంథాలను పంచాడు.
ఇతడు బొంబాయి దగ్గర ల బాంద్రా వద్ద 1575 లో సెయింట్ ఆన్స్ కళాశాలను, కొచ్చిన్ వద్ద ముద్రణాలయాన్ని స్థాపించాడు. జీసుయిట్ మత సంస్థను స్థాపించాడు. ఆదివారం సెలవు దినంగా వీరు ప్రకటించారు.
సిలబస్ నన్ను పుస్తక రంగంలో వీరు ముద్రించారు.
1578లో గోవా దగ్గరలోని 'చౌల్' లో మరొక కళాశాలను పోర్చుగీస్వేరు స్థాపించారు.
1716లో భారత్లో “ట్రాంక్విబార్” వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను "జిగెన్బార్గ్” ప్రారంభించాడు.