Type Here to Get Search Results !

Vinays Info

నియత విద్య (Formal Education)

నియత విద్య (Formal Education)

  • ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠశాలలలో, కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో ఈనాడు జరుపుతున్న విద్యావిధానం నియత విద్య అనవచ్చు.
  • ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పర్చుకొన్న పాఠ్యప్రణాళిక, బోధనా పద్ధతులతో నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో బోధించే విధానాన్ని నియత విద్య అంటారు. 
  • ఈ విధానంలో బోధనకు ఒక పాఠశాల, బోధించడానికి అవసరమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, బోధనకు ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. 
  • విద్యార్థుల వయో పరిమితిని అనుసరించి పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు బోధిస్తారు. 
  • బడికి నిర్ణయించిన సమయంలో బోధన పూర్తి కాలం జరుగుతుంది. దీనినే కృత్రిమమైన విద్య గావ్యవహరిస్తారు. దీని వనరులన్నీ పరిమితం. 
  • నియత విద్యకు పాఠశాల కేంద్రం అయినప్పటికీ గ్రంథాలయం, మ్యూజియం,జంతు ప్రదర్శనశాల, విద్యను బోధించే మత సంస్థలు, శిక్షణను ఇచ్చే క్రీడా సంస్థలు మొదలైనవి కూడా నియత విద్యా సంస్థలుగా గుర్తించడమైంది.
  • విద్యా సంస్థ అంటే సక్రమంగా రూపొందించిన విద్యా విధానాల ద్వారా ప్రజల అవసరాలను ఏర్పాటైన సామాజిక నిర్మితి - బోగార్డస్
  • ఒక భావనతో, నిర్మితిలో కూడినదే విద్యా సంస్థ అని అన్నది -నమ్నర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section