రాష్ట్ర వనరుల కేంద్రం - State Resource Centre(SRC)
- ప్రాథమిక సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యావ్యాప్తికి హైదరాబాద్‌లో ఆంధ్రమహిళా సభా ప్రాంగణంలో స్థాపించిన ఈ సంస్థ సంపూర్ణ అక్షరాస్యతా సాధన దిశలో పలు కార్యక్రమాలను చేపడుతోంది.
- వయోజన విద్యకు సంబంధించిన వాచకాల రచన, క్షేత్ర సిబ్బందికి మార్గదర్శకాలు ఉన్న కరపుస్తకాల (Hand books) ముద్రణతోపాటు సిబ్బందికి, నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
- అక్షరాస్యతా వ్యాప్తికి సభలు, సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం ఈ సంస్థ కార్యకలాపాల్లో భాగం. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యతాభివృద్ధికి ఈ సంస్థ చేస్తున్న కృషి ఎనలేనిది.