రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ - State Institute of Educational Technology(SIET)
- మన రాష్ట్రంలో 1985లో స్థాపించిన ఈ సంస్థను రాష్ట్ర దృశ్యశ్రవణ విద్యా వికాస కేంద్రం అని కూడా అంటారు.
- దీని స్థాపనకు ఆదర్శం CIET.
- ఈ కేంద్రం బాలబాలికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించి 'టెలిస్కూల్' పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది.
- ఉపాధ్యాయుల కోసం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, వారి సాధికారతకు తోడ్పడుతుంది.
- జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థల సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో బోధనాభ్యాసన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక ధోరణులను పరిచయం చేయడం, విద్యా నాణ్యతకు పాటుపడటం లాంటి లక్ష్యాల సాధన కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.
Disclaimer: We have published the above information for reference Purpose only, For any changes on the content we refer to visit the Official website to get the latest & Official details.