6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సామెతలు
- పొమ్మనలేక పొగపెట్టినట్లు
- ఉరుమురిమి మంగళంమీద పడ్డట్టు
- ఊరందరిదో దారి ఉలిపికట్టెదో దారి
- సందిట్లో సడేమియా అన్నట్టు
- గుమ్మడికాయలదొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు
- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు
- పుణ్యంకొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు
- తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలె
- ఇంటింటికో మంటిపొయ్యి
- అడిగినట్లిస్తే కడిగినట్లవుతది
- ఆకిందపడ్డా మీదికాలు నాదే
- ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
- కుండ పగిలినా కుక్కగుణం తెలిసె
- చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు
- పోచమ్మ కుండపెడ్తా మైసమ్మ మాయంచేసె
- పిల్ల పయిలం ముల్లె పయిలం
- విత్తు చిన్న విచారం పెద్ద
- సుఖమొస్తే మొహంకడుగ తీరికలేదన్నట్లు
- ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం
- చుట్టమై వచ్చి దయ్యమై పట్టె
- ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు