హంటర్ కమీషన్ - 1882(Hunter Commission - 1882)
- దీనినే ప్రథమ భారతీయ విద్యా కమీషన్(First India's Education Commission) అని అంటారు.
- 1882లో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ రాగానే విలియం హంటర్ అధ్యక్షతన మొదటి విద్యా కమీషన్ను ఏర్పాటు చేయడం జరిగింది.
- ఉద్దేశ్యం : ప్రాథమిక విద్యలో మౌళిక మార్పులు తేవటం
- ఈకమీషన్ సిఫార్సుల వలన ప్రాథమిక పాఠశాలలు స్థాపించడం జరిగింది. యాజమాన్యం బాధ్యతను ప్రభుత్వమే చేపట్టడం జరిగింది.
- మాధ్యమిక విద్యా నిర్వహణ నుండి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం.
- నిత్య జీవితమునకు పనికి వచ్చే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్ర గణితమును ప్రాథమిక విద్యా ప్రణాళికలో చేర్చింది,
- ఉన్నత విద్యా నిర్వహణను విశ్వ విద్యాలయాలకు అప్ప జెప్పడం.
- మతపరమైన బోధనలను పాఠశాలలో చేర్చరాదని సూచించింది.
- వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించడమైంది.