Type Here to Get Search Results !

Vinays Info

జాతీయాదాయం (National Income)

జాతీయాదాయం (National Income)

  • దేశంలోని ప్రజలందరి ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు. ఒక దేశంలోని ప్రజలందరూ వివిధ రంగాల ద్వారా సంపాదించిన ఆదాయాల మొత్తాన్ని జాతీయదాయం అంటారు.
  • ఒక దేశ ఆర్థిక వ్యవస్థలోని మొత్తం రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువలను జాతీయాదాయంగా పేర్కొనవచ్చు.
  • ఒక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల ద్వారా జరిగిన మొత్తం ఉత్పత్తిని ఒక సంవత్సర కాలంలో లెక్కిస్తే వచ్చే మొత్తం ఆదాయం అని అర్థం.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి జరగాలంటే ఉత్పత్తి కారకాలను వాడుకోవాల్సి ఉంటుంది. అవి
1. భూమి (Land)
2. శ్రమ (Labour)
3. మూలధనం (Capital)
4. వ్యవస్థాపన (Organization)
  • ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. అలాంటప్పుడు ఉత్పత్తి కారకాలను వాడుకున్నందుకు ప్రతిఫలాలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే భూమికి భాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు అయిన భాటకాల విలువ, వేతనాల విలువ, వడ్డీ విలువ, లాభాల విలువలను ఒక సంవత్సర కాలంలో లెక్కిస్తే వచ్చే విలువను జాతీయాదాయంగా పరిగణించవచ్చు.
  • జాతీయాదాయాన్ని లెక్కించడానికి తీసుకొనే ఆర్థిక సంవత్సరం- ఏప్రిల్‌/మార్చి 31
  • ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం ద్వారా జరిగే మొత్తం ఉత్పత్తిని జాతీయాదాయంగా పేర్కొంటారు.
  • ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగే మొత్తం ఉత్పత్తుల విలువ, మొత్తం ఆదాయ విలువ, మొత్తం వ్యయం విలువను జాతీయాదాయంలో భాగంగా పేర్కొంటారు.

నిర్వచనం(Defination of National Meaning)

  • ఒక దేశంలో, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువను జాతీయాదాయం అంటారు.
  • ఒక దేశంలో, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువను మార్కెట్‌ ధరలతో గుణిస్తే వచ్చే ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు.
  • ఒక దేశంలో జరిగిన మొత్తం ఉత్పత్తి, మొత్తం ఆదాయం మొత్తం వ్యయాల విలువను జాతీయాదాయంగా పేర్కొనవచ్చు.
  • జాతీయాదాయాన్ని ప్రతి సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు.
  • భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఇందులో ప్రతి త్రైమాసికానికి ఒకసారి జాతీయాదాయాన్ని, వృద్ధి రేటును అంచనా వేస్తారు. సంవత్సరంలో 4 త్రైమాసికాల ఆధారంగా సంవత్సర వృద్ధిని అంచనా వేస్తారు.

జాతీయాదాయ నిర్వచనాలు

మార్షల్‌ ప్రకారం..
  • ఒక దేశంలో, ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనాన్ని ఉపయోగించి సహజవనరుల సహాయంతో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తుసేవల మొత్తం నికర వాస్తవ వార్షికాదాయాన్ని జాతీయాదాయం అంటారు.

ఫిగూ ప్రకారం..

  • ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని ‘జాతీయాదాయం’ అంటారు.
  • ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ నిరపేక్ష ఆదాయం అంటే దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన వస్తు సేవల ఉత్పత్తిని ద్రవ్యంతో లెక్కిస్తే వచ్చే ఆదాయం అని అర్థం. దీనినే జీడీపీగా పేర్కొంటారు.
  • విదేశాల నుంచి లభించే ఆదాయం అంటే ఎకానమీ పరిభాషలో నికర విదేశీ కారక ఆదాయం (Net Factor Income From Abroad-NFIA) అని అంటారు.
  • NFIA- ను R-P గా పేర్కొంటారు.
  • R-Recived Income (విదేశాల నుంచి లభించే ఆదాయం) అని అర్థం.
  • శామ్యూల్‌సన్‌ ప్రకారం..
  • ఒక దేశంలో ఒక సంవత్సరం కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయాదాయం అంటారు.
  • సైమన్‌ కుజునెట్స్‌ ప్రకారం..
  • ఒక దేశంలో, ఒక సంవత్సర కాలంలో ఉత్పాదక వ్యవస్థల నుంచి తుది వినియోగదారులకు చేరే నికర మొత్తం సముదాయాన్ని ‘జాతీయాదాయం’ అంటారు.
జాతీయాదాయం కమిటీ..
  • ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును రెండు సార్లు విలువ కట్టకుండా (లెక్కించకుండా) జాగ్రత్త పడుతూ, పూర్తిగా తయారైన అంతిమ వస్తు సేవల విలువను అంచనా వేస్తే వచ్చే ఆదాయ విలువను జాతీయాదాయం అంటారు.
  • కేంద్ర గణాంక సంస్థ (CSO) ప్రకారం..
  • ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాటికి ప్రతిఫలాలుగా భాటకం+ వేతనాలు+ వడ్డీలు+లాభాల రూపంలో వచ్చే ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు.
  • ఐక్యరాజ్యసమితి(UNO) ప్రకారం..
  • ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను జాతీయాదాయం అంటారని పేర్కొంది.

జాతీయాదాయం భావనలు..

  • GDP: Gross Domestic Product స్థూల దేశీయోత్పత్తి/ మొత్తం దేశీయోత్పత్తి/ మొత్తం దేశీయ ఆదాయం
  • ఒక దేశంలో ఒక సంవత్సరం కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగే అంతిమ వస్తుసేవల ఉత్పత్తిని స్థూల దేశీయోత్పత్తి అంటారు.
  • GDP= C+I+G+ (x-m)
  • GDP= C+I+G+ (x-m)+ s u-T
  • C= Consumption= వినియోగం
  • I-Investment= పెట్టుబడి
  • G= Govt expenduture = ప్రభుత్వ వ్యయం
  • X= Exports= ఎగుమతులు
  • M= Imports= దిగుమతులు/నికర విదేశీ రాబడి/ నికర విదేశీ పెట్టుబడి
  • S u= Indirect Taxes= పరోక్ష పన్నులు
  • జీడీపీని లెక్కించేటప్పుడు వస్తు సేవల స్థూల ఉత్పత్తి విలువ నుంచి ఉత్పత్తి కారకాల విలువను తీసివేస్తే కలిపిన స్థూల విలువ (GVA- Gross Value Added) అంటారు.
  • కలిపిన స్థూలవిలువ= స్థూల ఉత్పత్తి విలువ- ఉత్పాదక విలువ.
  • GVA- Gross Value output- Value of Input
  • ఒక దేశంలో GVA=GDP
  • ఒక రాష్ట్రంలో GVA= GSDP
  • ఒక జిల్లాలో GVA=GDDP
  • సాధారణంగా GVA అంటే GDP
  • GNP-Gross National Product (స్థూల జాతీయోత్పత్తి)
  • ఒక దేశంలోని పౌరుల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవ ల విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు.
  • GNP=GDP+NFTA (GNP=GDP+R-P అని కూడా
  • అనవచ్చు)
  • GNP=GDP+ R-P
  • GDP=GNP- (R-P)
  • GDP=GNP- (R+P)
  • GNP-GDP= R-P లేదా NFIA
  • GNP=GDP+NFIA
  • GDP=GNP-NFIA
  • GNP=GDP at maket price
  • GNP mp=
  • C+I+G+(x-m)+R-P+Su-T
  • స్థూల జాతీయోత్పత్తికి, స్థూల దేశీయోత్పత్తికి మధ్యగల వ్యత్యాసం R-P లేదా NFIA (నికర విదేశీ కారక ఆదాయం)
  • GDPకి నికర విదేశీ కారక ఆదాయాన్ని చేర్చితే GNP తెలుస్తుంది.
  • GNP నుంచి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసివేస్తే GDP వస్తుంది.
  • నికర విదేశీ కారకం శూన్యం అయితే GNP=GDP
  • నికర విదేశీ కారకం ధనాత్మకం అయితే
  • GNP < GDP
  • నికర విదేశీ కారకం రుణాత్మకం అయితే GNP > GDP
  • 3. NDP-Net Domestic Product
  • (నికర దేశీయోత్పత్తి)
  • స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే నికర దేశీయోత్పత్తి తెలుస్తుంది.
  • నికర దేశీయోత్పత్తి తరుగుదలను చేర్చితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది.
  • స్థూల దేశీయోత్పత్తికి, నికర దేశీయోత్పత్తికి మధ్యగల వ్యత్యాసం- తరుగుదల
  • NDP=GDP-D
  • GDP=NDP+D
  • GDP-NDP=D
  • GVA నుంచి ( Gross Value Added) తరుగుదలను (స్థిర మూలధన వినియోగాన్ని) తీసివేస్తే NVA (Net Value Added) అంటే కలిపిన నికర విలువ తెలుస్తుంది.
  • అంటే NVA=GVA-D
  • ఒక దేశంలో NVA=NDP
  • ఒక రాష్ట్రంలో NVA= NSDP
  • ఒక జిల్లాలో NVA=NDDP
  • NDP mp=C+I+G+ (x-m)-D
  • NDPfc= C+I+G (x-m)+ R-P-Su-Ti
  • 4. NNP- Net National Product నికర జాతీయోత్పత్తి
  • స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను ‘నికర జాతీయోత్పత్తి’ అంటారు.
  • NNP=GNP-D
  • GNP=NNP+D
  • GNP-NNP=D
  • తరుగుదల అంటే మూలధన తరుగుదల యంత్రాలు, యంత్రపరికరాల తరుగుదల.
  • తరుగుదల=స్థూల పెట్టుబడి-నికర పెట్టుబడి
  • స్థూల పెట్టుబడి-తరుగుదల= నికర పెట్టుబడి
  • నికర పెట్టుబడి+ తరుగుదల= స్థూల పెట్టుబడి
  • స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడుల మధ్యగల సంబంధం- తరుగుదల
  • NNP mp= C+I+G+(x-m)+R-P -D
  • NNP fc= C+I+G (x-m) + R-P + su-Ti-D
  • వ్యష్టి ఆదాయం (పర్సనల్‌ ఇన్‌కం)
  • ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు పొందిన ఆదాయాల మొత్తాన్ని ‘వ్యష్టి ఆదాయం’ అంటారు. దీనినే వ్యక్తిగత ఆదాయం అని కూడ అనవచ్చు.
  • అంటే వ్యక్తుల చేతికొచ్చిన ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు.
  • వ్యష్టి ఆదాయం= సంపాదిత ఆదాయం+అసంపాదిత ఆదాయం
  • వ్యష్టి ఆదాయం= ఆర్జిత ఆదాయం+ అనార్జిత ఆదాయం
  • వ్యష్టి ఆదాయం=ఉత్పత్తిలో పాల్గొనడం ద్వారా వచ్చిన ఆదాయం+ ఉత్పత్తిలో పాల్గొనకున్నా ఉచితంగా లభించే ఆదాయం.
  • వ్యష్టి ఆదాయం= ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల లభించే ఆదాయం+ బదిలీ చెల్లింపులు.
  • ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వ్యక్తులకు లభించే ఆదాయం= జాతీయాదాయం-సాంఘిక భద్రతా చెల్లింపులు-పంచిపెట్టిన లాభాలు
  • వ్యష్టి ఆదాయం-జాతీయాదాయం-సాంఘిక భద్రత (విరాళాలు)- పంచిపెట్టని లాభాలు+ బదిలీ చెల్లింపులు
  • బదిలీ చెల్లింపులు
  • ప్రభుత్వం నుంచి ప్రజలకు ఉచితంగా లభించే ఆదాయాన్ని ‘బదిలీ చెల్లింపులు’ అంటారు.
  • ఉదాహరణ
  • వృద్ధాప్య, వికలాంగులు, వితంతువుల పెన్షన్స్‌, విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్‌, నిరుద్యోగ భృతి, శరణార్థులకు ఇచ్చే నష్టపరిహారం, ప్రకృతి వైపరీత్యం సందర్భాల్లో చెల్లించే నష్టపరిహారం.
  • సాంఘిక భద్రతా విరాళాలు
  • భవిష్యత్తు భద్రత కోసం ప్రజలు తమ ప్రస్తుత సంపాదనలో మినహాయించుకునే భాగమే సాంఘిక భద్రతా విరాళాలు.
  • ఉదాహరణ: భవిష్య నిధి జమ, బీమా ప్రీమియాలు
  • జాతీయాదాయంలో భాగంగా ఉండి వ్యష్టి ఆదాయంలో లేనివి సాంఘిక భద్రతా విరాళాలు, పంచిపెట్టని లాభాలు.
  • 6. వ్యయార్హ ఆదాయం (DPI)- Disposable Personal Income:
  • వ్యక్తుల చేతికొచ్చిన ఆదాయాన్నంత ఖర్చుచేసే అర్హత ఉండదు. ఇందులో ఖర్చుచేసే అర్హత గల ఆదాయాన్ని ‘వ్యయార్హ ఆదాయం’ అంటారు.
  • వ్యష్టి ఆదాయం నుంచి వ్యష్టి పన్నులను తొలగిస్తే వచ్చేది వ్యయార్హ ఆదాయం.
  • వ్యష్టి అంటే వ్యక్తులు చెల్లించే ప్రత్యక్ష పన్నులు.
  • l వ్యయార్హ ఆదాయం= వ్యష్టి ఆదాయం- వ్యష్టి పన్నులు.
  • Pi-Pt
  • Pi- Indirect Income
  • Pt- Personal taxes
  • వ్యష్టి పొదుపు (పర్సనల్‌ సేవింగ్స్‌)
  • వ్యయార్హ ఆదాయం నుంచి వినియోగాన్ని తీసివేస్తే వచ్చేది పొదుపు.
  • ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు చేసిన పొదుపు మొత్తాన్ని ‘వ్యష్టి పొదుపు’ అంటారు.
  • వ్యష్టి పొదుపు= వ్యయార్హ ఆదాయం-వినియోగంP S= DPI-L
  • వ్యయార్హ ఆదాయం= వ్యష్టి పొదుపు+ వినియోగంDPI=PS+C
–సంతోష్‌విషయ నిపుణులుకరీంనగర్‌

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section