తెలంగాణలోని గనులు మరియు ఖనిజాలు | Mines in Telangana
VINAYS INFO
తెలంగాణలోని గనులు మరియు ఖనిజాలు | Mines in telangana
దేశ ఆర్థిక వ్యవస్థలో ఖనిజాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ ప్రధాన భూమిక. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలోనూ, జీడీపీ వృద్ధిలోనూ మైనింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
మైనింగ్ అంటే ఖనిజాల వెలికితీత. వీటిని భూగర్భ, ఉపరితల గనులుగా విభజించవచ్చు. ఉపరితల గనులు అంటే విస్తారంగా తవ్వడం, అంటే ఓపెన్ కాస్ట్. క్వారీ, స్ట్రిప్, తవ్వకం, హైడ్రాలిక్ మైనింగ్‌గా పేర్కొనవచ్చు.
భూపటలం నుంచి వెలికితీసే రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయనిక మూలకాలతో ఏర్పడిన ముడి పదార్థాన్ని ‘ఖనిజం’ అంటారు.
ఖనిజ వనరులను అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ‘మినరాలజీ’ అంటారు. ఇది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇవి ఒక ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. తెలంగాణ రాష్ట్రం దాదాపు 33 మిలియన్ టన్నుల పారిశ్రామిక ఖనిజాలను 50-55 మిలియన్ టన్నుల బొగ్గును, 54 మిలియన్‌ల ఘనపు మీటర్ల పరిమాణం గల రాళ్లను, భవన నిర్మాణ పరికరాలను ఉత్పత్తి చేస్తుంది.
రాష్ట్రంలో ప్రధాన ఖనిజాలుఇనుము
ఇనుము ఖనిజ నాణ్యత ఆధారంగా 4 రకాలుగా విభజించవచ్చు.
మాగ్నటైట్, హెమటైట్, లియెనైట్, సిడరైట్.
రాష్ట్రంలో అధిక మొత్తంలో హెమటైట్ ఉంది.
తక్కువ మొత్తంలో మాగ్నటైట్ రూపంలో ఇనుము లభిస్తుంది. మాగ్నటైట్ నిల్వలు విస్తరించిన ప్రాంతాలు బిత్వాల్, తల్లాడ, రస్తూరాబాద్, రోబాన్‌పల్లి, లక్సెట్టిపేట, టిట్పూర్.
రాష్ట్రంలో విస్తరించిన జిల్లాలు: వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం (చెరువుపురం, బయ్యారం, నావపాడు), భద్రాద్రి కొత్తగూడెం. దేశంలో తొలి ఇనుప గని సింగ్భమ్ (జార్ఖండ్-1904).
క్రోమైట్
ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఉపరితల ఖనిజంగా లభిస్తుంది.
విస్తరించిన ప్రాంతాలు: భీమవరం, గౌరారం, జన్నవరం, ఇమాన్‌నగర్, ఇంకూరు (ఖమ్మం).