తత్వశాస్త్ర వాదాలు-విద్యాలక్ష్యాలు (Philosophical theories Aims of education)
భావవాదం (Idealism)
ఇది అతి పురాతనమైనది. దీనిని ప్లేటో ప్రతిపాదించాడు. సోక్రటీస్, ఠాగూర్, గాంధీజీ, వివేకానందస్వామి, రాధాకృష్ణన్ వంటి తత్వవేత్తలు దీనిని నమ్మినవారు. ఆధ్యాత్మిక అంశాలైన దేవుడు, ఆత్మ, పరమాత్మ, ఆదర్శాలు మొదలైన భావాలకు ప్రాధాన్యం ఇచ్చే వాదాన్ని "భావవాదం" అంటారు.
విద్యాలక్ష్యాలు
1) ఆత్మ జ్ఞానాన్ని విద్య కల్పించాలి.
2) సంపూర్ణ మూర్తిమత్వం సాధించుట
3) విద్య ద్వారా నైతిక విలువలను పెంపొందించుట
4) జీవితాశయాలకు అనుగుణంగా సృజనాత్మక శక్తులను విద్యద్వారా పెంపొందించుట
ప్రకృతివాదం (Naturalism)
దీనిని రూసో ప్రతిపాదించాడు. జీవన సమస్యలన్నింటిని ప్రకృతి పరిష్కరించగలదని ఈ వాదం విశ్వసిస్తుంది. ప్రకృతియే వాస్తవం. భౌతిక ప్రపంచం వాస్తవం. బెకెన్, లామార్క్, డార్విన్, స్పెన్సర్, మాంటిస్సోరి వంటి తాత్వికులు ఈ వాదాన్ని నమ్ముతారు.
విద్యాలక్ష్యాలు
1) సహజ ప్రకృతికి అనుగుణమైన విద్య
2) శిశు కేంద్రంగా విద్య
3) ఆనందమే విద్యా లక్ష్యం
4) స్వయం వ్యక్తీకరణ
5) సామర్ధ్యం పెంపొందించుట
6) సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం
7) సహజాతాలు
8 స్వే
9) ఇంద్రియాలు విద్యకు మూలాధారాలు
వ్యవహార సత్తావాదం (Progmatism)
దీనిని విలియంజేమ్స్, జాన్డ్యూయి గార్లు ప్రతిపాదించారు. వ్యవహారసత్తావాదం) ఆదర్శవాదానికి, ప్రకృతివాదానికి మద్యస్థంగా ఉంటుంది. 'ప్రాగ్మాటిజం' అనేది గ్రీకుపదం. 'ప్రాగ్మా' అంటే ఆంగ్లంలో (Action) అని తెలుగులో 'కృషి' అని అర్థం. 'ప్రాగ్మాటిజమ్' అంటే ఒక పనిలో నిమగ్నం కావటం. ఈ సిద్ధాంతాన్ని చార్లెస్, కిల్పిట్రిక్, మార్గరేట్, బెకన్ మొదలైనవారు. నమ్ముతారు.
విద్యాలక్ష్యాలు
1. విద్యార్థులకు వారి జీవ, సామాజిక అవసరాలను తీర్చే విద్యను అందించడం
2. సమస్యల సాధనకు తోడ్పడటం
3. విద్యార్థుల వృత్తి సామర్ధ్యం పెంచడం
4. సంపూర్ణ వ్యక్తిగత అభివృద్ధి సాధించడం
5. ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడం
6. నూతన విలువలు సృష్టించ వీలు కల్పించటం