Type Here to Get Search Results !

Vinays Info

వైర‌స్ వ్యాధులు(Virus Dieses)

వైర‌స్ వ్యాధులు(Virus Dieses)

వైరస్‌లు కంటికి కనిపించని హానికర సూక్ష్మజీవులు. వీటి వల్ల అనేక ప్రమాదకర సంక్రమిక, అసంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి. ఇవి ఎక్కువగా పరాన్నజీవనం, సహజీవనం గడిపే సూక్ష్మజీవులు.

  • వైరస్‌ల అధ్యయనం- వైరాలజీ
  • వీటిని కనుగొన్నది- ఇవనోవ్‌స్కీ
  • వైరస్‌ అనే పదానికి లాటిన్‌ భాషలో అర్థం- విషం
  • ఇవి అతిసూక్ష్మ జీవులు. కాబట్టి వీటిని ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలుగుతాం.
  • ఇవి జీవి దొరికినప్పుడు సజీవంగా ఉండి, అందుబాటులో లేనప్పుడు వాతావరణంలో స్ఫటికాల రూపంలో ఉంటాయి. వీటినే అవికల్ప పరాన్నజీవులు లేదా విరియాన్‌ అంటారు.
  • వీటికి కణ నిర్మాణం లేదు. కేవలం కేంద్రకామ్లం (DNA, RNA), దాని చుట్టూ ప్రొటీన్‌ తొడుగు ఉంటుంది.
  • ఇవి రసాయనికంగా న్యూక్లియో ప్రొటీన్స్‌.
  • జంతు వైరస్‌లలో DNA ఉండగా వృక్ష వైరస్‌లలో RNA ఉంటుంది.
  • నోట్‌: హెచ్‌ఐవీ అనే జంతు వైరస్‌లో మాత్రం RNA ఉంటుంది.
  • కేవ లం ప్రొటీన్‌ తొడు గు మాత్రమే కలిగి ఉండి కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనపరిచే వైరస్‌ను ప్రయాన్‌ అంటారు.

వైరస్‌ వల్ల వచ్చే వ్యాధులు

  • జలుబు- రైనో వైరస్‌
  • ఆటలమ్మ- వారిసెల్లా
  • మశూచి- వారియోలా
  • తట్టు- పారామిక్సో వైరస్‌
  • పోలియో (పక్షవాతం)- పోలియో 
  • వైరస్‌ఆటలమ్మ, మశూచి, తట్టు వ్యాధుల వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి.
గవద బిళ్లలు- మిక్సో వైరస్‌: 
  • ఈ వైరస్‌ పెరోటిడ్‌ అనే లాలాజల గ్రంథులకు ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుంది.

చికున్‌ గున్యా- ఆల్ఫా వైరస్‌: 
  • ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో స్వాహిని భాషలో దీనికి అర్థం వంగి నడవటం.
  • దీని వల్ల తవ్ర జ్వరం కండర నొప్పులు కలుగుతాయి.

డెంగీ- ఫ్లావి వైరస్‌: 
  • ఇది రక్త ఫలకికలను విచ్ఛిత్తి చేస్తుంది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, ముక్కు, చిగుళ్ల నుంచి నీరు కారుతుంది.

హెపటైటిస్‌ (పచ్చ కామెర్లు)- హెపటైటిస్‌-బి వైరస్‌: 
  • ఇది తల్లి నుంచి శిశువుకు, రక్తమార్పిడి ద్వారా, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల కాలేయం తన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించదు.

రేబిస్‌- రాబ్డో వైరస్‌: 
  • పిచ్చి కుక్క, పిల్లి కాటు వల్ల ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కొందరు నీటిని చూస్తే భయపడిపోతుంటారు. ఈ స్థితిని హైడ్రోఫోబియా అంటారు.

సార్స్‌- కరోనా వైరస్‌: 
  • ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించిన తీవ్ర వ్యాధి. దీని వల్ల జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు వస్తుంది.
  • క్యాన్సర్‌- ఆంకోవైరస్‌: దీని అధ్యయనాన్ని ఆంకాలజీ అంటారు. జన్యువులు నియంత్రించే కణవిభజన అదుపుతప్పడం వల్ల క్యాన్సర్‌ అనే గడ్డలు ఏర్పడతాయి. దీనికి కారణం జన్యువుల్లో మార్పులు (ఉత్పరివర్తనాలు).
ఫ్లూ- ఫ్లూ వైరస్‌: 
  • ఇది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఇది రెండు రకాలు. అవి..
  • బర్డ్‌ ఫ్లూ- H5N1 వైరస్‌: దీన్నే SVM ఇన్‌ఫ్లూయెంజా అంటారు.
  • స్వైన్‌ఫ్లూ-H1N1 వైరస్‌: ఈ ఫ్లూకి ఇచ్చే మందులు టామి ఫ్లూ, నాట్‌ ఫ్లూ, రెలింగా.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section