1. భారతదేశము : భౌగోళిక స్వరూపాలు
I) భారతదేశము : విస్తరణ
- భారతదేశము ఉత్తరార్ధ గోళములో ఆసియా ఖండంలో దక్షిణ దిశన ఉన్నది.
- అక్షాంశాల వారిగా భారతదేశ ఉనికి 8°4′ ఉత్తరము నుండి 37°6' ఉత్తరం మధ్యన, రేఖాంశాల వారిగా 68°7' తూర్పు, నుండి 97°25' తూర్పు మధ్య ఉన్నది.
II) భారతదేశము ద్వీపకల్పము :
- 'ద్వీపకల్పము' అనగా మూడు దిక్కుల నీరు ఉండి ఒక దిక్కు భూభాగము ఉన్న భూ స్వరూపము. భారతదేశం దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రంచే ఆవరించబడి ఉన్నది.
III) భారతదేశము ఉపఖండము :
- వైవిధ్యమైన శీతోష్ణ స్థితులు, అనేక వృక్ష, జీవజాతులు ఉండి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు, సుదీర్ఘమైన కోస్తా తీరము, విభిన్న భాషలు, జీవన వైవిధ్యం కలిగి ఉండడంచేత భారతదేశము 'ఉపఖండంగా' పిలవబడుతున్నది.
IV) భారతదేశ ప్రామాణిక కాలం మరియు గ్రీన్విచ్ ప్రామాణిక కాలం :
- భారత ప్రామాణిక కాల రేఖాంశము 82030 తూర్పు రేఖాంశము. ఇది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా వెళ్ళుతుంది.
- ఇది గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి 5 1/2 గంటలు ముందు ఉన్నది.
- గ్రీన్విచ్ రేఖాంశం '0' డిగ్రీల రేఖాంశము ఇది 'ఇంగ్లాండ్లో లండన్ నగరము దగ్గరగా గ్రీన్విచ్ పట్టణము గుండా వెళ్ళుతుంది.
V) భూగర్భ నేపథ్యం మరియు భారతదేశ ముఖ్య భౌగోళిక స్వరూపాలు
- భారత ద్వీపకల్పము గోండ్వానా భూభాగంలోనిది. 200 మిలియన్ల సంవత్సరాల క్రితం (20 కోట్ల), గోండ్వానా ముక్కలుగా విడిపోయి, భారతదేశ ద్వీపకల్ప లకం ఈశాన్య దిశగా పయనించి, చాలా పెద్దదైన యూరేషియ ఫలకం (అంగారా భాగం)తో ఢీకొ ది. 'హిమాలయాలు' ఈ ప్రక్రియ వలన ఏర్పడినవే.
భారతదేశ భూభాగాన్ని క్రింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు :
- హిమాలయాలు
- గంగా - సింధూనది మైదానం
- ద్వీపకల్ప పీఠభూమి
- ఎడారి ప్రాంతం
- తీరప్రాంత మైదానాలు
- దీవులు
VI) హిమాలయాలు :
- హిమాలయాలు భారతదేశానికి ఉత్తర దిక్కున విస్తరించి ఉన్న ప్రపంచంలోని ఎత్తైన మరియు నవ్య
- ముడుత పర్వతాలు. తూర్పు దిశల మధ్య విస్తరించి ఉన్నాయి. హిమాలయాల పొడవు.
- హిమాలయాలు పశ్చిమ 2400 కి.మీ. వెడల్పు పశ్చిమాన 500 కి.మీ. నుండి తూర్పు వెళ్ళే కొలది 200 కి.మీ.గా ఉన్నవి.
VII) హిమాలయాల్లో మూడు సమాంతర పర్వత శ్రేణలున్నాయి. అవి : -
- ఉన్నత హిమాలయాలు (హిమాద్రి)
- నిమ్న హిమాలయాలు (హిమాచల్)
- బాహ్య హిమాలయలు (శివాలిక్)
- ఉన్నత హిమాలయాలు సముద్ర మట్టం నుండి 6100 మీటర్ల సరాసరి ఎత్తుతో, అదే విధంగా నిమ్న హిమాలయాలు 3700 మీటర్ల నుండి 4500 మీటర్ల సరాసరి ఎత్తుతో ఉన్నాయి.
- ఉన్నత హిమాలయాలు (హిమాద్రి)లో హిమానీ నదాలు కనబడతాయి. మంచు పేరుకోవడం, హిమానీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా 'జీవనదుల'కు నీటిని అందిస్తాయి.
- నిమ్న హిమాలయాల్లో పీర్ పంజల్, మహాభారత శ్రేణులు ముఖ్యమైనవి.
VIII) హిమాలయాల్లోని లోయలు, వేసవి విడుదులు :
- నిమ్న హిమాలయాల్లో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్లోని కులు, మనాలి, కంగ్రా లోయలు మరియు సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్ వంటి వేసవి విడుదులు ఉన్నాయి. ఇవి సతత హరిత అరణ్యాలను కలిగి ఉన్నాయి.
IX) హిమాలయాలలో కొన్ని 'అత్యున్నత శిఖరాలు' :
- హిమాలయాలలో కొన్ని 'అత్యున్నత శిఖరాలు' హిమాద్రిలో భాగంగా ఉన్నాయి. అవి : ఎవరెస్టు, కె2, గాడ్విన్ ఆస్టిన్, కాంచన గంగ, అన్నపూర్ణ, ధవళగిరి, నాంచా బర్వా, నంగా ప్రభాత్, నందాదేవి మనస్లూ కొన్ని ఉదాహరణలు.
X) డూన్స్ మరియు డౌర్స్ :
- నదులచే తీసుకురాబడ్డ బురద మరియు అవక్షేపాలు శివాలిక్ శ్రేణులలోని సరస్సులలో నిక్షేపించబడ్డాయి.
- నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడి సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనబడే మైదానాలను ఏర్పరచాయి.
- ఉత్తరాంచల్ లోని డెహ్రాడూన్ వీటికి ఒక మంచి ఉదాహరణ.
X) హిమాలయాల ప్రాముఖ్యత :
- హిమాలయ పర్వతశ్రేణులు భారతదేశ శీతోష్ణస్థితిని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. హిమాలయాలు భారతదేశానికి ఉత్తరాన సహజ రక్షణ కల్పిస్తున్నాయి.
- మధ్య ఆసియా నుండి వచ్చే శీతల గాలుల నుండి రక్షిస్తున్నవి.