'బీసీల్లోని కులవృత్తులు, చేతి వృత్తి కులాల వారికి ఆర్థికసాయం' పథకాన్ని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు 09-06-2023 లాంఛనంగా ప్రారంభించారు.
ఇందులో భాగంగా తోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన శ్రీ కుందారపు మురళికి (కుమ్మరి వృత్తి), భీమారం గ్రామానికి చెందిన శ్రీ మామిడి సత్యనారాయణకి (నాయి బ్రాహ్మణ వృత్తి) ముఖ్యమంత్రి లక్ష రుపాయల చెక్కును తమ చేతుల మీదుగా అందించారు.