1947 జూలై 22న భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సూచన మేరకు పింగళి వెంకయ్య (కృష్ణా జిల్లా) జాతీయ పతాకాన్ని రూపొందించారు.
1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆమోదించారు.
జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1929 డిశంబర్ 31న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్ లాల్ నెహ్రూ ఎగురవేశారు.
(ads1)
జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 3 : 2.
జాతీయ జెండా పైభాగాన ముదురు కాషాయము (కేసరి), మధ్యభాగాన తెలుపు, క్రింది భాగాన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి.
మధ్యభాగమైన తెలుపు పట్టీ మీద ముదురు నీలి రంగుతో, కూడిన చక్రం ఉంటుంది. ఈ చక్రం సారనాథ్ (ఉత్తరప్రదేశ్)లోని అశోకుని సింహచక్రాన్ని (ధర్మచక్రం) పోలి ఉంటుంది.
ఈ చక్రం 24 ఆకులు (Spokes) కల్గి ఉండును.
జాతీయ జెండా విదేశాలలో ఎగురవేసిన మహిళ - మేడం భికాజీ కామా (జర్మనీలో స్టట్గార్ట్)