తెలంగాణ రాష్ట్రం - విస్తీర్ణం(Area of Telangana State)
VINAYS INFOJune 23, 2022
తెలంగాణ రాష్ట్రం - విస్తీర్ణం(Area of Telangana State)
తెలంగాణ రాష్ట్రం 15°50' నుండి 19°51' ఉత్తర అక్షాంశాల మధ్య, 77°15′ నుండి 81°19' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. (ఖమ్మంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత). ఇది దేశంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉన్నది.
ఇది భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.41% కల్గి ఉంది.
నాటి ఖమ్మంజిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపబడింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని “హైదరాబాద్”.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాలు 10. 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేసిన జిల్లాలు 21. 2019 ఫిబ్రవరి 17న ఏర్పాటు చేసిన జిల్లాలు 2 మొత్తం 33 (10 + 21 + 2)
ప్రస్తుతం తెలంగాణ జిల్లా సగటు విస్తీర్ణం (3608 చ.కి.మీ)లో 15వ స్థానంలో, జిల్లా సగటు జనాభాలో (10.3 లక్షలు) 17వ స్థానంలో ఉంది.
అత్యధిక జిల్లాల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది.
దేశంలో అత్యల్ప జిల్లా మరియు మండల జనాభా కల్గిన రాష్ట్రం - తెలంగాణ
రాష్ట్రంలో సగటు జిల్లా జనాభా 11.5 లక్షలు. ఇది 80% రాష్ట్రాలలో 14.5 లక్షలుగా ఉంది.
రాష్ట్రంలో సగటు మండల జనాభా 63,600. దేశంలో 6 రాష్ట్రాలలో మాత్రమే బ్లాక్ స్థాయిలో సగటు జనాభా తెలంగాణ కంటే తక్కువగా ఉంది.