1.మన జెండా(Mana Jenda)
- ప్రక్రియ : గేయం
- ఇతివృత్తం : దేశభక్తి
- రచయిత: శేషం లక్ష్మీ నారాయణాచార్య
- మూలం : స్వరభారతి - భక్తి, దేశభక్తి గేయ సంకలనం
- ఉద్దేశం : భారత స్వతంత్ర పోరాటంలో మన వెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశ్యం.
గేయం
శాంతి సహనం సత్యరూపమా
శౌర్యకాంతితో వెలిగిన దీపమా
నమామి భారత పతాకమా
స్వరామి త్రివర్ణ కేతనమా
పవిత్ర భారత ధరాతలమ్మున
పరాయిపాలన ముంత మొనర్చి
పంజర విముక్త జగమ్ములా
అంబర మెగిసిన స్వతంత్రమా!
స్వేచ్ఛా సాధన సమరంలో
ముందు నడిచిన ప్రతాపమా
స్వాతంత్ర్యం మా జన్మహక్కునీ
గర్జించిన పర్జన్య రావమా!
ముష్కర బ్రిటీషు మత్తగజాలను
హడలెత్తించిన అంకుశమా
సమరావనిలో సహోదరాశకి
అండగ నిల్చిన ఆయుధమా
అర్ధాలు:
- త్రివర్ణకేతనం = మూడు రంగుల జెండా
- అంబరం - ఆకాశం
- ధరాతలం - భూమి
- పర్జన్యాలు = మేఘలు
- ముష్కరులు -దొంగలు
- ఖగం – పక్షి
- రవం – శబ్ధం
- సమరం – యుద్ధం
సరోజినీ నాయుడు
- సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది.
- తల్లిదండ్రులు - అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీ దేవి, భర్త - జనరల్ ముత్యాలరాజుల , గోవిందనాయుడు.
- 1916 సరోజినీ నాయుడుకు గాంధీతో పరిచయం ఏర్పడింది.
- సరోజినీ నాయుడుకు గల బిరుదు - భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)
- 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎరవాడ జైలులో
- శిక్షను అనుభవించినది - సరోజినీ నాయుడు