రైతులు శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారా ఆహారధాన్యాలు,కూరగాయలు,పండ్లు, ప్రత్తి, జనుము మొదలైన అనేక రకాల పంటలు పండిస్తున్నారు.
వ్యవసాయంలో పనిముట్లు చాలా ముఖ్యమైనవి.
పనిముట్లు - 8
నాగలి
గొర్రు
పార
కొడవలి
వరినాట్లు వేసేయంత్రం
పంట నూర్పిడి చేసేయంత్రం
కలుపు తీసే యంత్రం
గడ్డపార
గతంలో రైతులు తాము పండించిన పంట నుండి కొన్ని మేలు రకం గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరచుకునేవారు.
గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు.పంట వచ్చిన తర్వాత తీసుకున్నదానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్దతిని - నాగులు అనేవారు.
మన దేశంలో 5400 రకాల వారి వంగడాలు, 740 రకాల మామిడి, 3500 రకాల వంకాయ వంగడాలు అందుబాటులో ఉండేవి.
మనదేశంలో National Bearaue of Plant Genetics అనే సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.
ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్నీ - అంతర పంటలు అని అంటారు.
మల్లేశం ఒక 10 ఎకరాల రైతు.
5ఎకరాలు
మల్బరీ తోట
1/2 ఎకరాల
మొక్కజొన్న+అల్లం(అంతర పంటగా)
1/2 ఎకరాల
పసుపు
3 ఎకరాల
పశువుల మేత
1 ఎకరం
వంగ,టమాటా,కూరగాయలు, లిల్లీ, మల్లె,బంతి,గులాబీ
చీడ పురుగులు, తెగుళ్లు నివారణ కోసం - వేపనునే, పంచగవ్వ ఉపయోగిస్తారు.
పంచగవ్వ - అనేది ద్రవరూపంలో ఉన్న ఎరువు.
ఇది సూక్ష్మజీవి నాశనంగా పనిచేస్తుంది.
పంచగవ్వ తయారీ - 9 రకాల పదార్థాలు
ఆవు మూత్రం
పేడ
నెయ్యి
పాలు
పెరుగు
అరటిపండు
కొబ్బరినీళ్లు
బెల్లం
నీళ్లు
జీవామృతం - ఎరువుగా, నేలను సారవంతం చేసి సూక్షజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది.
జీవామృతం తయారీ పదార్థాలు - 06
ఆవు మూత్రం
పేడ
మట్టి
బెల్లం
పప్పుధాన్యాల పొడి
నీరు
గుడ్ల కోసం - లేయర్ల ను, మాంసం కోసం బ్రాయిలర్లను పెంచుతారు.
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ - అనేది ఒక భారతదేశంలో వ్యవసాయ ఆధారిత ఎన్జీవో సంస్థ. దీనిని 1983లో స్థాపించబడింది. (HQ - Hyderabad) ఇది సంగారెడ్డి జిల్లా, పాస్తాపూర్ లో ఉంది.
ఆహార పంటలు : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యలు, నూనె దాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి.
వాణిజ్య పంటలు : పత్తి, జనుము, మిర్చి, పసుపు.
వరి రకాలు : IR20, హంస, స్వర్ణ, మాసూరి, బంగారు తీగ, సాంబ.
కంది రకాలు : ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి.
ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి.
4 నెలల కాలపు పంటలు - వరి, జొన్న, శనగ.
వరికి నీరు ఎక్కువ అవసరం.
జొన్న, శనగ పంటలకు నీరు తక్కువగా అవసరమవుతాయి. వీటిని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటారు.
వ్యవసాయం - పంటలు(5th Class EVS) | https://vinaysinfo.blogspot.com/2021/10/agriculture-and-crops.html
ReplyDelete#VinaysInfo #ts5thclassnotes