Type Here to Get Search Results !

Vinays Info

వ్యవసాయం - పంటలు(5th Class EVS)

  • వ్యవసాయం అనగా - పంటలు పండించడం
  • రైతులు శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారా ఆహారధాన్యాలు,కూరగాయలు,పండ్లు, ప్రత్తి, జనుము మొదలైన అనేక రకాల పంటలు పండిస్తున్నారు.
VinaysInfo Agriculture and Crops
  • వ్యవసాయంలో పనిముట్లు చాలా ముఖ్యమైనవి.
  • పనిముట్లు - 8

    1. నాగలి
    2. గొర్రు
    3. పార
    4. కొడవలి
    5. వరినాట్లు వేసేయంత్రం
    6. పంట నూర్పిడి చేసేయంత్రం
    7. కలుపు తీసే యంత్రం
    8. గడ్డపార
  • గతంలో రైతులు తాము పండించిన పంట నుండి కొన్ని మేలు రకం గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరచుకునేవారు.
  • గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు.పంట వచ్చిన తర్వాత తీసుకున్నదానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్దతిని - నాగులు అనేవారు.
  • మన దేశంలో 5400 రకాల వారి వంగడాలు, 740 రకాల మామిడి, 3500 రకాల వంకాయ వంగడాలు అందుబాటులో ఉండేవి.
  • మనదేశంలో National Bearaue of Plant Genetics అనే సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.
  • ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్నీ - అంతర పంటలు అని అంటారు.
  • మల్లేశం ఒక 10 ఎకరాల రైతు.
  • 5ఎకరాలు మల్బరీ తోట
    1/2 ఎకరాల మొక్కజొన్న+అల్లం(అంతర పంటగా)
    1/2 ఎకరాల పసుపు
    3 ఎకరాల పశువుల మేత
    1 ఎకరం వంగ,టమాటా,కూరగాయలు, లిల్లీ, మల్లె,బంతి,గులాబీ

  • చీడ పురుగులు, తెగుళ్లు నివారణ కోసం - వేపనునే, పంచగవ్వ ఉపయోగిస్తారు.
  • పంచగవ్వ - అనేది ద్రవరూపంలో ఉన్న ఎరువు.
  • ఇది సూక్ష్మజీవి నాశనంగా పనిచేస్తుంది.
  • పంచగవ్వ తయారీ - 9 రకాల పదార్థాలు
  1. ఆవు మూత్రం
  2. పేడ
  3. నెయ్యి
  4. పాలు
  5. పెరుగు
  6. అరటిపండు
  7. కొబ్బరినీళ్లు
  8. బెల్లం
  9. నీళ్లు
  • జీవామృతం - ఎరువుగా, నేలను సారవంతం చేసి సూక్షజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది.
  • జీవామృతం తయారీ పదార్థాలు - 06
  1. ఆవు మూత్రం
  2. పేడ
  3. మట్టి
  4. బెల్లం
  5. పప్పుధాన్యాల పొడి
  6. నీరు
  • గుడ్ల కోసం - లేయర్ల ను, మాంసం కోసం బ్రాయిలర్లను పెంచుతారు.
  • డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ - అనేది ఒక భారతదేశంలో వ్యవసాయ ఆధారిత ఎన్జీవో సంస్థ. దీనిని 1983లో స్థాపించబడింది. (HQ - Hyderabad) ఇది సంగారెడ్డి జిల్లా, పాస్తాపూర్ లో ఉంది.
  • ఆహార పంటలు : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యలు, నూనె దాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి.
  • వాణిజ్య పంటలు : పత్తి, జనుము, మిర్చి, పసుపు.
  • వరి రకాలు : IR20, హంస, స్వర్ణ, మాసూరి, బంగారు తీగ, సాంబ.
  • కంది రకాలు : ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి.
  • ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి.
  • 4 నెలల కాలపు పంటలు - వరి, జొన్న, శనగ.
  • వరికి నీరు ఎక్కువ అవసరం.
  • జొన్న, శనగ పంటలకు నీరు తక్కువగా అవసరమవుతాయి. వీటిని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటారు.
  • కంది పంటకు - 6 నెలల సమయం కావాలి.ఇది ఆరుతడి పంట.

Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. వ్యవసాయం - పంటలు(5th Class EVS) | https://vinaysinfo.blogspot.com/2021/10/agriculture-and-crops.html
    #VinaysInfo #ts5thclassnotes

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Ads Section