తీరోక్క పూలను తెంపుకొచ్చిన
సూదీ దారం తోటి దండ గుచ్చిన
చేమంతుల దండ అమ్మకిచ్చిన
కనకాంబరం దండ అక్కకిచ్చిన
లిల్లీపూల దండ చెల్లికిచ్చిన
పొన్నపూల దండ పాపకిచ్చిన
సన్నజాజీ దండ వదినకిచ్చిన
గులాబీల దండ గుడిల ఇచ్చిన
ఇంటి దర్వాజకు బంతిపూదండ
నా చిట్టి జడకెమో సిరిమల్లె దండ