Type Here to Get Search Results !

Vinays Info

మనం చెట్లను పెంచుదాం ! (5th Class EVS)

  • అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు(33%) ఉండాలి.
  • మనదేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి.
  • అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతుంది.
  • వర్షాలు తగ్గి, భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి.నదులు ఎండి పోతున్నాయి.
  • సముద్ర మట్టం పెరుగుతున్నది.
  • వాతావరణంలో కాలుష్యం పెరిగి సమతుల్యత తగ్గుతుంది.
  • మొక్కలు పెరగటానికి - నీరు, సూర్యకాంతి, సారవంతమైన నేల అవసరం.
  • మొక్కలు తమ కోసం కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల మొక్కలను ఉత్పత్తిదారులు అని అంటారు.
  • పాఠశాలలో నిరంతరం నీడనిచ్చే మొక్కలు నాటుకోవాలి. ఉదా : కానుగా, వేప...
  • రోడ్లకిరువైపుల - వేప, రావి, మర్రి, కానుగ వంటి మొక్కలు నాటుకోవాలి.
  • మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి. వీటిని కుండీల్లో పెంచడాన్ని - బోన్సాయ్ లేదా వామన వృక్షాలు అని అంటారు.
  • ఇది జపాన్ దేశపు సంప్రదాయ కళ.
  • కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ - Council for Green Revolution
    • స్థాపించిన సంవత్సరం : 22-ఏప్రిల్
    • ముఖ్యఉద్దేశ్యం : ప్రకృతిని కాపాడడం కోసం.
    • ఇది దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలను పంపిణీ చేసింది.
    • కోటి మొక్కల సంకల్పంలో భాగంగా - వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది.
    • ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల - గడ్డంపల్లి, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా.
  • నగరాల్లో 67% మంది ప్రజలు నివసిస్తున్నారు.గ్రామీణ ప్రాంతంలో - 33%
  • కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
  • పూర్వము ప్రతి ఇంటిలో కొంత స్థలంలో - పెరడు ఉండేది.
  • వేప చెట్టును - ఐక్యరాజ్య సమితి శతాబ్ది వృక్షంగా ప్రకటించింది.
  • వేప వేయి రోగాలకు మందు అని అంటారు.
  • UNO - United Nations Organisation 
  • Green Revolution(హరిత విప్లవం)
  1. ప్రపంచంలో - నార్మన్ బోర్లాగ్(1945-మెక్సికో)
  2. భారతదేశంలో - యం.యస్.స్వామీనాథన్(1996-గోధుమ)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section