తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం 'యాదాద్రి జిల్లాలో గలదు.
హైదరాబాద్ కు 60 కి.మీ. దూరంలో ఉంది.
ఆ ఋష్యశృంగుని కొడుకు యాదర్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేసి నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకొన్నాడు.
అప్పటి నుండి ఆ గుట్టను యాదర్షి పేరు మీద 'యాదగిరి గుట్ట' అని పిలుస్తున్నారు.
ఈ గుట్టమీద ఉన్న గుండం “విష్ణు గుండం'. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.
విష్ణు గుండం పక్కనే ఉన్న ఆలయం - ఆంజనేయస్వామి ఆలయం
నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా యాదగిరి గుట్ట మీద ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వరాలయాన్ని దర్శించుకొంటారు.
ఆలయంలో స్వామి వారికి ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అష్ణోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది.
ఉగాది రోజున స్వామి వారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు.
ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్ఘున శుద్ధ విదియ నుండి ద్వాదశివరకు 11 రోజుల పాటు వైభవంగా బ్రహోత్సవాలు జరుగుతాయి.
ఋష్యశృంగుని కొడుకైన యాదర్షి ఈ గుట్టపై తపస్సు చేసి నారసింహస్వామి దర్శనం పొంది, గుట్టపై వెలయమని కోరుకున్నాడు. యాదర్షి పేరు మీద 'యాదగిరి గుట్ట' నామం ఏర్పడింది.
యాదర్షి ఎవరి కుమారుడు - ఋష్యశృంగుడు
యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి రెండు కొవ్వులు గలవు. అవి : మెట్ట తొవ్వు, బస్సులు పోయే తొవ్వ,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక "సప్తగిరి' ఛానల్ కు పెట్టిన పేరు - యాదగిరి
కొండగట్టు అంజనేయస్వామి పుణ్యక్షేత్రం - కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం - జగిత్యాల జిల్లా)
ఇక్కడి ఆంజనేయుడు సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు.
ఆంజనేయస్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు.
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం - వేములవాడ, కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం - రాజన్న సిరిసిల్లా)
వాక్యాలు - కాలాలు
జరిగిపోయిన పనిని తెలుపు వాక్యాలు - భూతకాలపు వాక్యాలు
లక్ష్మీ ప్రసన్న సినిమా చూసింది.
జరుగుతున్న పనిని తెలుపు వాక్యాలు - వర్తమానకాలపు వాక్యాలు
సరళ నృత్యం చేస్తున్నది.
జరగబోవు పనిని గురించి తెలుపు వాక్యాలు - భవిష్యత్ జాలపు వాక్యాలు