వ్యవసాయం - పంటలు(Agriculture - Crops)
- రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునేవారు పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు ఈ పద్ధతిని ‘నాగులు’ అంటారు.
- మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం దాదాపు 5400వరి వంగడాలు, 740 మామిడిరకాలు 3500 వంకాయ రకాలు ఉండేవి.
- సాంప్రదాయ పంటల విత్తనాలు భద్రపరచడం లో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి.
- ఒక ప్రక్క చోట ఒకే కాలంలో లో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడానికి ‘అంతర పంటలు’ అంటారు.
- ఆవు మూత్రం, పేడ, నెయ్యి ,పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి కలిపి ‘పంచగవ్య’ ను తయారు చేస్తారు. ఇది ఇది సూక్ష్మ జీవి నాశినిగా పనిచేస్తుంది. ఇది ద్రవరూపంలో ఉండే ఎరువు .
- ఆవు మూత్రం , పేడ. మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు, కలిపి ‘జీవామృతం’ కూడా తయారుచేసి ఉపయోగిస్తున్నారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది.
- మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్ లు అంటారు.
- గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్లు అంటారు.
- తక్కువ నీటితో పండే పంటలు కంది పచ్చ జొన్నలు రాగులు బొబ్బర్లు అనుములు పెసర్లు కొర్రలు వులువలు పల్లీలు సజ్జలు.
- కంది కి మరొక పేరు తొగాళ్ళు,
- బొబ్బర్ల కు మరొక పేరు అలసందలు.
- రాగుల కు మరొక పేరు తయిదలు.
- అనేక మంది రైతులకు సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలు పండించడానికి “దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ” అవగాహన కల్పిస్తుంది.
- పంటలపై అనేక రసాయన మందులు చల్లడం వల్ల వాటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చి అవకాశం ఉంది.
- రసాయన మందులు వాడడం వల్ల కొంతకాలం తెగుళ్లు తగ్గిపోయి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ పంటలకు హాని కలిగించే పురుగుల తో పాటు మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల తగ్గిపోతుంది. భూ కాలుష్యం వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.
- మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. వరి ,గోధుమ ,జొన్న ,మొక్కజొన్న ,పప్పు ధాన్యాలు ,నూనె ధాన్యాలు, కూరగాయలు ,పండ్లు మొదలైనవి పండుతాయి. వీటిని “ఆహారపంటలు “అని అంటారు. వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి, వంటివి కూడా పండుతాయి వీటిని “వాణిజ్య పంటలు” అంటారు.
- వరిలో లో అనేక రకాలు ఉంటాయి ఉదాహరణకు హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ, IR20.
- కందిలో కూడా అనేక రకాలు ఉంటాయి ఉదాహరణకు ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి.
- ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి. కొన్ని పంటలు రెండు మూడు నెలల లోపే చేతికి వస్తే మరికొన్ని పంటలకు సుమారు ఆరు నెలల సమయం అవసరమవుతుంది. వరి జొన్న శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరం అయితే జొన్న శనగలకు తక్కువ నీరు అవసరమవుతుంది.
- జొన్న శెనగల వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు.
- కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది.