మన శరీర భాగాలు-జ్ఞానేంద్రియాలు(Our Body Parts-Sense Organs)
- శరీరం బయట కనిపించేవి - శరీర బాహ్యభాగాలు
- జ్ఞానేంద్రియాలు - 05
- కన్ను - చూడటానికి
- చెవి - వినడానికి
- ముక్కు - వాసన చూడటానికి
- నాలుక - రుచులు చూడటానికి
- చర్మం - స్పర్శ కొరకు
- కంటికి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును - ఆప్తమాలజిస్టు లేదా కంటి డాక్టరు అని అంటారు.
- కంటికి మరియు వస్తువుల మధ్య దూరం
- కన్ను - పుస్తకం - 30 సెంటి మీటర్లు
- కన్ను - టెలివిజన్ - 2.5 మీటర్లు
- కంటిని ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడే పదార్థాలు - క్యారెట్, బొప్పాయి, పాలకూర, కరివేపాకు.
- ఒక వ్యక్తికి పుట్టుక నుంచే చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడటం రాదు.
- ఇలాంటి వారికోసం - సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఇందుకు సైగలతో విషయాలను తెలియజేస్తారు.
- చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులకు వైద్యం చేయు డాక్టరును - ENT నిపుణులు అంటారు.
- నాలుక పై ఉండే రుచి మొగ్గలు రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
- ఆహార పదార్థాలను నమిలినప్పుడు అవి ముక్కలు ముక్కలుగా మారి లాలజలంతో కలిసి రుచిని ఇస్తాయి.
- దంతాలు - రకాలు(04)
- కొరుకు దంతాలు -
- కొర దంతాలు -
- నమలు దంతాలు -
- విసురు దంతాలు -
- చిన్నపిల్లలకు మొదటగా వచ్చే దంతాలను - పాల దంతాలు అని అంటారు. పాల దంతాల సంఖ్య - 20
- ఇవి కొన్ని సంవత్సరాల తర్వాత ఉడిపోతాయి
- దంతాలను శుభ్రం చేయడానికి - ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలు వాడరాదు.
- అలా వాడినట్లయితే దంతాల పై ఉన్న - ఏనామిల్ అనే పొర దెబ్బతింటుంది.
- దంత సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే డాక్టరుని - డెంటిస్ట్ అని అంటారు.
- చర్మం వలన మన శరీరంలోని భాగాలకు రక్షణ కలుగుతుంది.
- చర్మం వలన మనకు - స్పర్శ కలుగుతుంది.
- వేడి, గరుకైనా, నునుపైన, గట్టి, మెత్తని, చల్లని మొదలైన వాటిని చర్మం ద్వారా గుర్తించగలుగుతాం.
- చర్మ సంబంధిత వ్యాధులుకు చికిత్స చేసే డాక్టరు ను - డెర్మటాలాజిస్ట్ అంటారు.
- శరీరంలో అతి పెద్ద అవయవం - చర్మం
- మానవుని చర్మం దాదాపు 1 1/2 చ.మీ. వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది.
- పరిసరాలలో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితమయ్యే అవయవం - చర్మం.
- వేలి ముద్రలను గురించి అధ్యయనం చేయడాన్ని - డాక్తిలోగ్రాఫి అని అంటారు.