జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి - National Council for Teacher Education-(NCTE)
జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE):
➤కేంద్ర ప్రభుత్వం 1973లో దేశమంతటా ఒకే విధమైన ప్రమాణాలతో ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను నిర్వహించడానికి తగిన సలహా ఇచ్చేందుకు 'NCTE' అనే ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది.
➤కేంద్ర ప్రభుత్వం 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వంతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా దీన్ని రూపొందించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
➤1995 మే 17న స్వతంత్ర ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను స్థాపించింది. అవి
1) జైపూర్ (ఉత్తర ప్రాంతం)
2) బెంగళూరు (దక్షిణ ప్రాంతం)
3) భువనేశ్వర్ (తూర్పు ప్రాంతం)
4) భోపాల్ (పశ్చిమ ప్రాంతం)
➤ మన రాష్ట్రం బెంగళూరులోని ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వస్తుంది
ఈ సంస్థ కార్యకలాపాలు:
- పూర్వ ప్రాథమిక, ప్రాథమిక ఎలిమెంటరీ, సెకండరీ స్థాయుల్లో వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ, దూర విద్యను అందించి వాటిలో గుణాత్మకతను పెంపొందించడానికి వ్యూహాలను రూపొందించడం.
- ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి, ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించడం.
- ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సర్వేలు, కార్యగోష్టులు, సెమినార్లను జాతీయ, క్షేత్రస్థాయుల్లో నిర్వహించి ఉపాధ్యాయ విద్యానాణ్యతకు తోడ్పడటం.
- ఉపాధ్యాయుల సమర్థతను, నిబద్ధతను పెంపొందించడానికి కృషి చేయడం.
- ఉపాధ్యాయ విద్యలో ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ధోరణులను పరిశీలించి మన దేశానికి అనువైన ధోరణులను ప్రచారం చేయడం.