ఉపాధ్యాయ సాధికారత - Teachers Empowerment
ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించి, విద్యా ప్రక్రియను సమర్థవంతం చేయడానికి మనదేశంలో పలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. అవి :
1) జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (National Council for Teacher Education - NCTE)
2) జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (National Council for Educational Research and Training - NCERT)
3) కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ (Central Institute of Educational Technology - CIET)
4) ఇంగ్లిష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ ((Central Institute of English and Foreign Languages - CIEFL). దీన్ని ప్రస్తుతం English & Foreign Language University (EFLU)అని వ్యవహరిస్తున్నారు.
5) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (State Council of Educational Research and Training - SCERT)
6) రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (State Institute of Educational Technology - SIET)
7) రాష్ట్ర వనరుల కేంద్రం (State Resource Centre - SRC)
8) ప్రాంతీయ విద్యాసంస్థలు (Regional Institutes of Education - RIE)
9) జిల్లా విద్యాశిక్షణ సంస్థలు (District Institutes of Education and Training - DIET)
10) మండల వనరుల కేంద్రాలు (Mandal Resource Centres - MRC)