Type Here to Get Search Results !

Vinays Info

జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి - National Council for Educational Research and Training(NCERT)

జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (National Council for Educational Research and Training - NCERT)

1961 సెప్టెంబరు 1న న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ప్రకటించింది.

  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు ఇది విద్యా సలహాదారుగా వ్యవహరిస్తుంది.

  ఉపాధ్యాయ పథకాలు, పాఠశాల విద్య, విధాన నిర్ణయాల అమలుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ NCERT నిపుణతను ఉపయోగించుకుంటుంది.

Also Read : జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి - National Council for Teacher Education - NCTE

ఈ సంస్థ కార్యకలాపాలు:

1) పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం.

2) వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి, ఫలితాలను ప్రచురించడం.

3) పాఠశాల స్థాయి పాఠ్య, పఠనీయ గ్రంథాలను (Reference books) తయారు చేయడం.

4) రాష్ట్ర ప్రభుత్వాల విషయ ప్రణాళికల నిర్మాణానికి సూచనలివ్వడం, సమీక్షించడం.

5) పరీక్షల సంస్కరణలకు తోడ్పడటం.

6) బోధనాభ్యాసన సామగ్రి, పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం.

7) జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షను (NTSE) నిర్వహించి, ఎంపికైన విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వడం.

8) శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో శాస్త్రగోష్టులు (Science fairs) నిర్వహించడం.

9) అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను పెంపొందించడానికి వ్యూహరచన చేయడం.

10) కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు విద్యావిషయక సలహాదారుగా విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవడం.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section