Type Here to Get Search Results !

Vinays Info

సైన్స్ అవార్డులు-Science Awards

Top Post Ad

ఎల్‌ఓరియల్-యునెస్కో అవార్డు

-సైన్స్‌రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు శాస్త్రీయ పురోగతి కోసం విశేష కృషి చేసిన మహిళా పరిశోధకులకు ఈ అవార్డును అందజేస్తారు. సైన్స్‌రంగంలో కేవలం మహిళలకు మాత్రమే ఇచ్చే అవార్డు.
-ఈ అవార్డును యునెస్కో, ఫ్రెంచ్ కాస్మోటిక్ కంపెనీ సంయుక్తంగా అందజేస్తాయి.
-అవార్డు గ్రహీతకు లక్ష డాలర్ల నగదు బహుమతి ఇస్తారు.
-కింది ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో అవార్డు గ్రహీతను ఎంపిక చేస్తారు. ఆఫ్రికా- మధ్య ప్రాచ్య, ఆసియా- పసిఫిక్, యూరప్, లాటిన్‌అమెరికా- కరేబియన్ దీవులు, ఉత్తరఅమెరికా
-2017లో విజేతలు నివేన్ ఖసాబ్ (సౌదీ అరేబియా), మిచెల్ సిమన్స్ (ఆస్ట్రేలియా), నికోలా స్పల్దిన్ (స్విట్జర్లాండ్), జెన్నానో బావో (అమెరికా), మారియా తెరెసా రూయిజ్ (చిలీ) బ్రేక్‌త్రు అవార్డు
-లైఫ్‌సైన్సెస్, ఫండమెంటల్ ఫిజిక్స్, గణితంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ఇస్తారు.
-ఈ అవార్డును బ్రేక్‌త్రు ప్రైజ్ బోర్డు అందజేస్తుంది.
-అవార్డు గ్రహీతకు 30 లక్షల డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.
-2018 సంవత్సరానికి గాను 20 మందికి ఈ అవార్డును అందజేశారు.

నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్

-జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంజినీరింగ్, గణితం, భౌతికశాస్త్రం లేదా సోషల్, బిహేవియర్ సైన్సెస్ రంగాల్లో విజ్ఞాన పురోగతికి విశేష కృషి చేసిన సైన్స్, ఇంజినీరింగ్ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు.
-ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు గౌరవపూర్వకంగా అందజేస్తారు.
-మొదటిసారి ఈ అవార్డును 1963లో ఇచ్చారు.
-2017లో 15 మంది నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌ను అందుకున్నారు.

ఓల్ఫ్ ప్రైజ్

-వ్యవసాయం, రసాయనశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం, వైద్యం, కళల్లో అత్యుత్తమ విజయం సాధించినవారికి ఈ అవార్డును అందజేస్తారు.
-ఈ అవార్డును ఇజ్రాయెల్‌కు చెందిన ఓల్ఫ్ ఫౌండేషన్ అందజేస్తుంది.
-అవార్డు గ్రహీతకు లక్ష డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.
-2018కి గాను గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో ఇద్దరు చొప్పున కళలు, వ్యవసాయం ఒక్కొక్కరికి ఈ అవార్డును ఇచ్చారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్

-శాస్త్రీయ, సాంకేతిక పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఈ అవార్డును అందజేస్తారు.
-ఈ అవార్డును మెక్సికోకు చెందిన వరల్డ్ కల్చరల్ కౌన్సిల్ అందజేస్తుంది.
-మొదటిసారి 1984లో ఈ అవార్డును అందజేశారు.
-2017కు గాను ఓమర్ ఎం యాగి అందుకున్నారు.

లాస్కర్ అవార్డు

-వైద్య విజ్ఞానశాస్త్రంలో ప్రధాన పాత్ర పోషించిన లేదా ఔషధరంగంలో ప్రజాసేవ చేసి జీవించి ఉన్న వ్యక్తులకు 1945 నుంచి ఈ అవార్డును అందజేస్తున్నారు.
-ఈ అవార్డును అమెరికా నోబెల్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు 86 మంది లాస్కర్ అవార్డు గ్రహీతలు నోబెల్ బహుమతులను అందుకున్నారు.
-ఈ అవార్డును ఆల్బర్ట్ లాస్కర్, మేరీ ఉడ్నార్డ్ లాస్కర్ స్థాపించారు.
-ఒక్కో కేటగిరీ అవార్డుకు 2,50,000 డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.
-2017కు గాను మైఖేల్ నిప్ హాల్, డగ్లస్ ఆర్ లోవే, జాన్ టీ స్కిల్లర్ అందుకున్నారు.

కవ్లీ ప్రైజ్

-కవ్లీ ప్రైజ్‌ను 2005లో స్థాపించారు. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్, నార్వేజియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్, కవ్లీ ఫౌండేషన్ ఈ అవార్డును సంయుక్తంగా ఇస్తాయి.
-ఈ అవార్డును నార్వే దేశం ఇస్తుంది.
-న్యూరో సైన్స్, నానోసైన్స్, అస్ట్రోఫిజిక్స్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డును ఇస్తారు.
-కవ్లీ ప్రైజ్ గ్రహీతకు లక్ష డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.
-2016కు గాను అస్ట్రోఫిజిక్స్‌లో ఇద్దరికి, నానోసైన్స్‌లో ఇద్దరికి, న్యూరోసైన్స్‌లో ముగ్గురికి కవ్లీ ప్రైజ్ ఇచ్చారు.

కోప్లే మెడల్

-ఈ మెడల్‌ను రాయల్ సొసైటీ అందజేస్తుంది. విజ్ఞానశాస్త్రంలోని ఏదైనా విభాగంలో అసాధారణ విజయాలు సాధించినవారికి ఈ అవార్డును అందజేస్తారు.
-అత్యంత పురాతన అవార్డు అయిన కోప్లే మెడల్‌ను రాయల్ సొసైటీనే ఇప్పటికీ అందజేస్తుంది. సైన్స్ అవార్డుల్లో ఇది పురాతనమైంది. దీనిని 1731లో స్థాపించారు.
-ఈ అవార్డు గ్రహీతకు 25వేల పౌండ్ల నగదు బహుమతిని అందజేస్తారు.
2017కు గాను అండ్రూ వైల్స్ అందుకున్నారు.

షా ప్రైజ్

-మొట్టమొదటి షా ప్రైజ్‌ను 2004లో ఇచ్చారు. దీన్ని 2002లో హాంకాంగ్‌లో స్థాపించారు.
-ఆస్ట్రానమి, లైఫ్ సైన్స్ అండ్ మెడిసిన్, మ్యాథమెటికల్ సైన్స్‌లో అత్యుత్తమ సేవకు ఈ అవార్డును అందజేస్తారు.
-ఈ అవార్డును ద షా ప్రైజ్ ఫౌండేషన్ అందజేస్తుంది.
-2017కు గాను సిమన్ డీ ఎం వైట్, ఇయన్ ఆర్ గిబ్బన్స్, రోనాల్డ్ డీ వాలే, జనోస్ కొల్లర్ ైక్లెర్ వోయిసిన్ అందుకున్నారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.