నేడు..అంతర్జాతీయ సంతోష దినోత్సవం
(సంతోషానీకో రోజు..
▪సంతోషం సగం బలం అన్నారు మన పెద్దలు.. గడిచిన 50 సంవత్సరాల్లో మన సగటు ఆయుర్ధాయం 60 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాలు పెరిగింది.. సంపాదన,ఖర్చు కూడా ఎన్నో రెట్లు పెరిగింది.. మరి సంతోషం సంగతో?
*▪“Forbes” అనే పత్రిక ప్రకటించిన 20 “సంతోషకర దేశాల జాబితాలో” మన భారత దేశానికి చోటు లేదు..కానీ విచిత్రంగా అదే పత్రిక ప్రకటించిన ప్రపంచం లోనే “అత్యంత ధనవంతుల” జాబితాల్లో మన దేశానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు..*
*▪“ధనమేరా అన్నిటికి మూలం” అని మన వాళ్ళు నమ్మడం కూడా ఈ దుస్థితికి కొంత కారణం.. డబ్బు దగ్గర అన్న,తమ్ముడు లాంటి బంధాలు లేకుండా దాని కోసం ఎలాంటి ఘోరానికైనా ఒడిగట్టడం ఒక కారణం అయితే.. ఎంత డబ్బు ఉన్న తృప్తి లేకుండా ఇంకా కావాలి..ఇంకా కావాలి ..అని ఎగబడ డం రెండో కారణం…*
▪ఇక వృత్తి పరమైన ఒత్తిడులు…ఒకప్పుడు ఎవరి వృత్తి వారిది..పక్క వారి వృత్తిలో జోక్యం చేస్కున్నట్లు కాకుండా వారికీ ఏదైనా సహాయం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు,కాని ఇపుడు పరిస్థితి వేరు ఎదుటి వారి మీద ఈర్ష్య,అసూయ పెరిగి ఎపుడు ఎదుటి వాడి ఎదుగుదలను వోర్చలేకపోవడం మరో కారణం
▪పెరిగిన చిన్న కుటుంబాలు కూడా ఈ పరిస్థితిని మరింత విషమం చేసాయి ఒక 30 సంవత్సరాల క్రితం కుటుంభం అంటే అమ్మ,నాన్న,పిల్లలే కాదు ఇంకా ఎంతో మంది మామయ్యలు,అత్తయ్యలు,తాత,నానమ్మ,బాబాయి ఇలా ఎన్నో వరసలతో ఉమ్మడి కుటుంబంగా కల్సి ఉండేదని మా తల్లి తండ్రులు చెప్పగా విన్నా.. మరి ఆ తర్వాత తర్వాత అమ్మ,నాన్న,పిల్లలు అనే చిన్న కుటుంభాలు మొదలయ్యాయి,మరి ఈ 2017లోనో భార్య,భర్త ఒకే ఇంట్లో, కాని పిల్లలు అదే ఊర్లో హాస్టల్ లో..అంటే మనుషుల మధ్యన దూరం ఎక్కువ అయిందన్న మాట…పోనీ విడి విడిగా ఉన్న కలిసి ఉంటారా అంటే బంధువుల్లో లేని వాడంటే చిన్న చూపు,ఉన్న వాడంటే కడుపు మంట..ఇంకా మనసారా మాట్లాడుకునేది ఎపుడు? ఇపుడు ఉన్న చాలా మంది నా తమ్ముళ్ళకి చెల్లెళ్లకి ఎవరికీ ఎవరు ఏమి అవుతారో కూడా తెలియదు..ఎందుకంటే బంధాల గురించి చెప్పాల్సిన తల్లిదండ్రులు వాటి గురించి చెప్పట్లేదు కనుక(చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు కనుక )….
▪ఇక మిగిలింది కుల మత భేదాలు మనుషులు అందరిలోనూ ఉండేదో అదే రక్తం,అదే మాంసం అని తెల్సి కూడా నేను ఫలానా కులం,ఫలానా మతం అని కొట్టుకుంటూ,మా నాయకుడు గొప్పంటే మా నాయకుడు మహా గొప్ప అనుకుంటూ మనఃశాంతిని
చంపుకుంటున్నాం …
▪అంతకంతకు పెరుగుపోతున్న నిరుద్యోగం మరో కారణం,ఎంత చదివినా రాని ఉద్యోగాలు,నాకు లక్ష రూపాయల జీతం వస్తే తప్ప ఉద్యోగం చేయను అనే తత్వం కొంత మంది యువత సొంతం.. ఇంక సంతోషం ఇలాంటి వారికీ ఎండ మావే…
*▪తగ్గిన దైవ భక్తి కూడా మరో కారణం మన చిన్నప్పుడు మన అమ్మ,నాన్నపండగలకి గుడికి తీస్కెల్లెవారు,ఇప్పుడు పండగ వస్తే అదో సెలవు రోజు అంతే సినిమాలు,షికార్లు అయిపోయింది ఆరోజు..గుడిలో ఉన్న కొద్ది సమయం అయిన మన కష్టాలు ఆ సర్వేశ్వరుడు చూస్కుంటాడు ,మన ప్రయత్నం మనం చేస్తే దైవం తప్పక సహకరిస్తాడు,అని మన హిందూ ధర్మం చెప్తుంది..కాని గడిచిన 20ఏళ్ళలో మన దేశంలో ప్రవేశించిన విదేశీ సంస్కృతి,క్రైస్తవం లాంటి మతాలు మన వాళ్ళ ఆలోచన సరళి మార్చేసింది..భక్తిని వ్యాపారం చేసిన స్వామీజీలు ,మన ప్రభుత్వాలది కూడా లోపం ఉంది..అంతే కాదు దైవ భక్తి లేనప్పుడు “పాప భీతి”, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం ఎలా వస్తుందనేది నా సందేహం..*
*▪అన్నిటికన్నా ముఖ్యమైన కారణం తృప్తి.. ఆశకి అంతు లేదు.. నడిచి వెళ్ళేవాడికి సైకిల్ ఉంటె చాలు అనిపిస్తుంది… సైకిల్ ఉన్న వాడికి కార్.. కార్ కూడా ఉంటె ఇంకా పెద్ద సౌకర్యాలు,ఇంకా ఎక్కువ ఖరీదు ఉన్న కారు కావాలి.. ఇలా ఆశకి అంతు లేకుండా పొందిన దానికి తృప్తి లేకుండా ఉండటం సంతోషం పోవడానికి అతి పెద్ద కారణం..*
▪అన్ని నాకే కావాలి,అంతా నాకే కావలి ఈ సంపాదించింది అంతా నేను, నా పిల్లలకే ఇంకా ఉంటె నా మనవలకే అని అలోచించి సంపాదన వ్యసనంగా మారి తృప్తిని దాని ద్వారా సంతోషాన్ని చంపుకుంటున్నాం…
▪ఏదో సినిమాలో కధానాయకుడు చెప్పినట్లు డబ్బు సంపాదించడం పరమావధి కాదు..ఒక శాస్త్రజ్ఞుడు కొత్త విషయం కనుక్కుంటే అది అతనికి సంతోషం.. ఒక వ్యాపారవేత్త కొత్త సూత్రం కనుక్కుంటే అది అతనికి సంతోషం.. ఆ ప్రయత్నం వాళ్ళకి డబ్బుని అందివచ్చు, కాని డబ్బు కోసమైతే వారు ప్రయత్నించరు..
*😀అంతర్జాతీయ సంతోష దినోత్సవం (మార్చి 20) స్పూర్తి కూడా అదే…. మనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.. సహాయం అంటే ఇక్కడ ధనమే కాదు ..మాట సాయం కూడా కావొచ్చు ..ఒక్కోసారి పెద్ద పెద్ద మందులతో నయం కాని జబ్బులు కూడా మాటలతో నమ్మకంతో నయం అయ్యాయి అని చరిత్ర చెప్పిన సత్యం.. చిన్న చిన్న వాటిలో కూడా ఆనందం వెతుక్కునే పసి పిల్లల తత్వం, భగవంతుని మీద విశ్వాసం మనకి వస్తే..అదే మన సంతోషాలకి తాళం చెవి..*
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)