Type Here to Get Search Results !

Vinays Info

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం..సందర్భంగా..*✍సురేష్ కట్టా

▪వినియోగదారుల ఉద్యమం ప్రప్రథమంగా అమెరికాలో ప్రారంభమయ్యింది. 1920లో మొట్టమొదటి వినియోగదారుల సంఘం అమెరికాలో ఏర్పడింది. దీని తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌, నార్వే ఇతర ఐరోపా దేశాలలో కూడా ఉద్యమం వ్యాప్తి చెంది అక్కడ కూడా వినియోగదారుల సంఘాలు ఏర్పడ్డాయి. 'రాల్ఫ్‌నాడార్‌'ని వినియోగదారుల ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. ఆయన కృషి వల్ల నేడు ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు ఉన్నాయి.

*▪మార్చి 15, 1962లో జెఎఫ్‌ కెన్నెడి ప్రప్రథమంగా నాలుగు వినియోగదారుల హక్కులు అమెరికా ప్రజలకు ప్రకటించారు. అవి- రక్షణ, సమాచారం, ఎంపిక, విజ్ఞప్తి చేసుకునే హక్కులు. తర్వాత ఆ హక్కులు ఎనిమిది అయ్యాయి.*

*▪1972లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకుడు అన్వర్‌ ఫజల్‌ మార్చి 15 తారీకుని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పరిగణించాలని తీర్మానించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 సంఘాలు, సంస్థలు 1973 మార్చి15ని వినియోగదారుల హక్కుల దినంగా పాటించాయి.*

*▪మనదేశంలో మొట్టమొదటి వినియోగ దారుల సంఘాన్ని అప్పటి బొంబాయి (ఇప్పటి ముంబయి)లో ప్రారంభించారు. మన రాష్ట్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్యమా న్ని 1973లో విశాఖపట్నంలో పరిగి వసంత కుమార్‌ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యింది. ఆయన మొదటి వినియోగదారుల సంఘాన్ని ప్రారంభించారు.*

*▪అవి వినియోగదారుల్లో చైతన్యం, వారి సంరక్షణ, సంక్షేమం, సేవాలోపాలు, వినియోగదారుల విద్య తదితర అంశాలలో ఈ సంఘాలు, సంస్థలు పనిచేస్తున్నాయి. మన దేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వినియోగదారులుగా మనకు ఆరు హక్కులు ప్రకటించింది.* అవి-

*1.వినియోగదారుల రక్షణ:*
▪మానవప్రాణాలకు, ఆస్తికి ప్రమాదకారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు. అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి.

*2.సమాచారం పొందే హక్కు:*
▪అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియజేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది.

*3.వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు:*
▪వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసుకోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం

*4.ప్రాతినిథ్యం వహించే హక్కు:*
▪వినియోగదారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగదారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిథ్యం వహించడం.

*5.విజ్ఞప్తి హక్కు:*
▪వినియోగదారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు- వినియోగదారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం.

*6.వినియోగదారుల విద్య హక్కు* వినియోగదారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోసపోతున్నారు.

*▪భారత ప్రభుత్వం 1989లో మార్చి 15 ని వినియోగదారుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని మార్చి 15 న జరుపుకుంటున్నాం.*

సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)
                   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section