➖➖➖➖➖➖➖➖➖➖➖
భారతదేశ ప్రధానులు - ప్రత్యేకతలు
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪జవహర్‌లాల్ నెహ్రూ (1889 - 1964)*
» పదవీ కాలం 15-08-1947 నుంచి 27-05-1964.
» భారతదేశ మొదటి ప్రధాని.
జవహర్‌లాల్ నెహ్రూ
» ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. (16 సంవత్సరాల 286 రోజులు).
» భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
» పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని.
» భారతరత్న అవార్డు (1955) పొందిన మొదటి ప్రధాని.
» ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని.
» మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు.
» అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరిగా పేరు పొందారు.
» పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు.
» ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
» భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి.
*▪గుల్జారీలాల్ నందా (1898 - 1998)*
» పదవీకాలం 27-5-1964 నుంచి 9-6-1964 వరకు.
గుల్జారీలాల్ నందా
» మొదటి తాత్కాలిక ప్రధాని.
» లాల్‌బహదూర్ శాస్త్రి మరణాంతరం రెండోసారి 11-1-1966 నుంచి 24-1-1966 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.
*▪లాల్‌బహదూర్‌శాస్త్రి (1904-1966)*
» పదవీకాలం 9-6-1964 నుంచి 11-1-1966 వరకు.
లాల్‌బహదూర్‌శాస్త్రి
» 1965లో పాకిస్థాన్‌తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నారు.
» 1966లో పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
» పదవిలో ఉండగానే మరణించిన రెండో ప్రధాని.
» 'జై జవాన్ - జై కిసాన్' అనే నినాదాన్ని ఇచ్చారు.
» విదేశంలో మరణించిన మొదటి ప్రధాని.
» మరణాంతరం భారతరత్న (1966) అవార్డు పొందిన మొదటి ప్రధాని.
» మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా ఈయనే.
» ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
» శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు.
» 'ఇండియన్ లింకన్'గా పేరుగాంచారు.
» హరిత విప్లవం కోసం కృషిచేశారు.
» నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఈయన కాలంలోనే ఏర్పాటైంది. ఇది ఆయన చేసిన క్షీర విప్లవ కృషిలో భాగం.
» ఏ పోర్టుఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.
» కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
*▪ఇందిరా గాంధీ (1917-1984)*
» మొదటిసారి పదవీకాలం 24-1-1966 నుంచి 24-3-1977 వరకు.
ఇందిరా గాంధీ
» రెండోసారి పదవీకాలం 14-1-1980 నుంచి 31-10-1984 వరకు.
» రెండోసారి చరణ్‌సింగ్ తర్వాత ప్రధానిగా వ్యవహరించారు.
» మొదటి మహిళా ప్రధాని.
» 1971లో 'గరీబీ హఠావో' నినాదాన్నిచ్చారు.
» రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి.
» 1969లో 14 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు.
» 1980లో మరో 6 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు.
» రాజభరణాలను 1970లో రద్దు చేయించారు.
» 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
» భారతరత్న అవార్డు (1971) పొందిన తొలి మహిళ.
» దిల్లీలో జరిగిన నామ్ సదస్సు (1983)కు అధ్యక్షత వహించారు.
» భారత రాజ్యాంగానికి అత్యధిక సవరణలు (37) ఈమె కాలంలోనే జరిగాయి.
» అత్యధికసార్లు అత్యవసర పరిస్థితులు ఈమె కాలంలోనే విధించారు.
» అరెస్టైన మొదటి ప్రధాని.
» 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని పదవిలో ఉండి ఓడిపోయారు.
» మొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు (18 మే 1974) 'స్మైలింగ్ బుద్ధ' పేరుతో ఈమె హయాంలోనే జరిగాయి.
» భారత్‌లో తొలిసారిగా మధ్యంతర ఎన్నికల్ని (1971) నిర్వహించిన ప్రధాని.
» ఈమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు.
» 1971లో రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
» 1972లో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని అప్పటి పాకిస్థాన్ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్నారు.
» ఎన్నికల్లో జరిగిన అవకతవకల కారణంగా ప్రధాని పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
» 15 ఏళ్ల 303 రోజులు ప్రధానిగా వ్యవహరించారు.
*▪మొరార్జీ దేశాయ్ (1896-1995)*
» పదవీ కాలం 24-03-1977 నుంచి 28-7-1979 వరకు.
మొరార్జీ దేశాయ్
» మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి.
» ఆర్థికమంత్రిగా ఎక్కువ పర్యాయాలు (8 సార్లు) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
» పెద్ద వయసులో (81 ఏళ్లు) ప్రధానిగా వ్యవహరించారు.
» 1991లో భారతరత్న అవార్డు అందుకున్నారు.
» 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఈయన కాలంలోనే తొలగించారు.
» ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి.
» మండల కమిషన్‌ను ఏర్పాటుచేశారు.
» నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు.
» దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
» ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానమంత్రుల్ని (చరణ్‌సింగ్, జగజ్జీవన్‌రాం)ఈయన కాలంలో నియమించారు.
» జన్మస్థలం గుజరాత్.
» పాకిస్థాన్ పురస్కారం 'నిషాన్-ఇ-పాకిస్థాన్' పొందిన తొలి భారతీయుడు.
*▪చరణ్‌సింగ్ (1902-1987)*
» పదవీ కాలం 28-7-1979 నుంచి 14-1-1980 వరకు.
చరణ్‌సింగ్
» రైతు బాంధవుడుగా పేరుగాంచారు.
» పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని.
» లోక్‌దళ్ పార్టీ వ్యవస్థాపకుడు.
» పార్లమెంటులో మొదటిసారిగా విశ్వాసతీర్మానం ప్రకటనను ఈయన కాలంలోనే జారీ చేశారు.
» ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
» ప్రధానమంత్రిగా 23 రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు.
*▪రాజీవ్ గాంధీ (1944-1991)*
» జన్మస్థలం ముంబయి.
రాజీవ్ గాంధీ
» పదవీకాలం 31-10-1984 నుంచి 01-12-1989 వరకు.
» అతి చిన్న వయసులో (42) ప్రధాని అయ్యారు.
» ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.
» పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు.
» కేంద్ర మంత్రిమండలిని అత్యధికంగా (13 సార్లు) పునర్ వ్యవస్థీకరించారు.
» సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు.
» నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు.
» జవహర్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు.
» 'బికారీ హఠావో' నినాదాన్ని ఇచ్చారు.
» IPKF (Indian Peace Keeping Force) దళాలను శ్రీలంకకు పంపారు.
» ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పరచారు.
» బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలొచ్చాయి.
» ఈయన మే 21, 1991న హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఏటా మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా భారత ప్రభుత్వం పాటిస్తోంది.
*▪విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1931-2008)*
» జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
» పదవీకాలం 2-12-1989 నుంచి 10-11-1990 వరకు.
» మండల కమిషన్ సిఫార్సుల్ని అమలు చేశారు.
» విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయారు.
» దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టారు.
» అంతర్‌రాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేశారు.
» అయోధ్య వివాదంలో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.
*▪చంద్రశేఖర్ (1927-2007)*
» పదవీ కాలం 10-11-1990 నుంచి 21-6-1991 వరకు.
చంద్రశేఖర్
» జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
» ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని.
» ఈయన కాలంలోనే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.
» భారత్ రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి.
» ఈయన్ని 'యంగ్ టర్క్' అంటారు.
» 'బోన్సీ బాబా'గా పేరొందారు.
» 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతినిచ్చి వివాదాస్పదుడయ్యారు.
» పార్లమెంటులో కోరం సభ్యుల మద్ధతు లేకుండానే జనతాదళ్‌ను చీల్చి కాంగ్రెస్ మద్ధతుతో ప్రధానిగా వ్యవహరించారు.
*▪పాములపర్తి వెంకట నరసింహారావు (1921-2004)*
» జన్మస్థలం తెలంగాణ.
పాములపర్తి వెంకట నరసింహారావు
» పదవీకాలం 21-6-1991 నుంచి 16-5-1996 వరకు.
» దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి.
» పూర్తి పదవీకాలం మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించిన ఏకైక ప్రధాని.
» దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్‌సింగ్‌తో కలిసి పునాదులు వేశారు.
» పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాని అయిన తొలి వ్యక్తి. తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు.
» 'లుక్ ఈస్ట్' అనే పాలసీని సూత్రీకరించిన ప్రధాని.
» బహు భాషా పండితుడు.
» ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా (1971-73) పని చేశారు.
» 'దేశ్ బచావో, దేశ్ బనావో' నినాదాన్ని ఇచ్చారు.
» ఈయన ఆత్మకథ పేరు "The Insider".
*▪అటల్ బిహారీ వాజ్‌పేయీ (1926)*
» జన్మస్థలం మధ్యప్రదేశ్.
అటల్ బిహారీ వాజ్‌పేయి
» మొదటిసారి పదవీకాలం 16-5-1996 నుంచి 01-6-1996 వరకు.
» రెండోసారి 19-3-1998 నుంచి 22-5-2004 వరకు.
» మొదటిసారి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు.
» ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని.
» కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు.
» పోఖ్రాన్‌లో రెండోసారి అణుపరీక్షలు 'ఆపరేషన్ శక్తి' పేరుతో 11 మే, 1998న నిర్వహించారు.
» లాహోర్ బస్సు రాయబారం ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
» అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టారు.
» 'జై విజ్ఞాన్' అనే నినాదాన్ని ఇచ్చారు.
*▪హెచ్.డి. దేవెగౌడ (1933)*
» జన్మస్థలం కర్ణాటక.
హెచ్.డి. దేవెగౌడ
» పదవీ కాలం 01-6-1996 నుంచి 20-4-1997 వరకు.
» దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన రెండో వ్యక్తి.
» కేంద్ర క్యాబినెట్ మంత్రి అవ్వకుండానే ప్రధానిగా వ్యవహరించారు.
» రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవిని నిర్వహించిన రెండో వ్యక్తి.
» పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా ప్రధాని అయిన రెండో వ్యక్తి.
» 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
» అతి తక్కువ మంది లోక్‌సభ సభ్యుల్ని (44) కలిగియుండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
*▪ఐ.కె. గుజ్రాల్ (1919-2012)*
» జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం.
ఐ.కె. గుజ్రాల్
» పదవీకాలం 21-4-1997 నుంచి 19-3-1998 వరకు.
» రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టిన మూడో వ్యక్తి.
» వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు.
» జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి (14 పార్టీలు) నేతృత్వం వహించారు.
» గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారు.
*▪డాక్టర్ మన్మోహన్ సింగ్ (1932)*
» పాకిస్థాన్‌లోని జీలంలోని 'ఘా' అనే గ్రామంలో జన్మించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్
» మొదటిసారి పదవీకాలం 22-5-2004 నుంచి 25-5-2009 వరకు.
» రెండోసారి పదవీకాలం 25-5-2009 నుంచి 26-5-2014 వరకు.
» రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధాని అయ్యారు.
» ప్రధాని పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త.
» విశ్వాసతీర్మానంపై ఓటు వేయలేని మొదటి ప్రధాని.
» కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
» యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) కూటమి ద్వారా ప్రధాని అయ్యారు.
» అమెరికాతో 123 అణు ఒప్పందాల్ని కుదుర్చుకున్న ప్రధాని.
» దేశంలో సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్నవారిలో 3వ స్థానంలో ఉన్నారు.
» లోక్‌సభ పదవీకాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాని.
» 2010లో వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డు పొందారు.
» వరుసగా 5వ సారి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
» వరుసగా 10సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు.
*▪నరేంద్ర మోదీ (1950)*
» 26 మే 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.
నరేంద్ర మోదీ
» గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
» 'స్వచ్ఛభారత్' నినాదాన్ని ఇచ్చారు.
» 'జనధన్ యోజన'ను ప్రారంభించారు.
» వారణాసి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు.
〰〰〰〰➰〰〰〰〰