Type Here to Get Search Results !

Vinays Info

రెగ్యులేటింగ్ చట్టం (Regulating Act) - 1773

Top Post Ad

రెగ్యులేటింగ్ చట్టం (Regulating Act) - 1773

ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం రాజ్యాంగ పాలన. రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి తత్వవేత్త 'అరిస్టాటిల్.' రాజ్యాంగ పాలన క్రింద ప్రజలు కొనసాగడం చైతన్యానికి ప్రతీకే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్నాడు. రాజ్యాంగం ఒక దేశ మౌలిక మరియు సర్వోన్నత శాసనం. రాజ్యాంగంలో ప్రభుత్వ అంగాల నిర్మాణం, అధికార పరిధులు వాటి మధ్య సంబంధం, ప్రజల హక్కులు, వాటి పరిరక్షణ, పరిపాలనా స్వభావాన్ని నిర్దిష్టమైన రూపంలో చట్టబద్ధం చేయబడతాయి. దేశంలో అన్ని చట్టాలకు రాజ్యాంగమే మూలాధారం.

రెగ్యులేటింగ్ చట్టం - 1773

రెగ్యులేటింగు చట్టానికి రాజ్యాంగ వికాస పరంగ చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి చేసిన మొట్టమొదటి చట్టం. అందుకే దీనిని భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్టు ఇండియా కంపెనీకి మొదటిసారిగా రాజకీయ పరిపాలన, అధికారాలు సంక్రమించడం జరిగింది. దీనితో భారతదేశంలో కేంద్రీకృతపాలనకు పునాదులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

ముఖ్యాంశాలు

  • ఈ చట్టాన్ని మే, 18, 1773లో లార్డ్ నార్త్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఉద్దేశింపబడినందున దీనిని రెగ్యులేటింగు చట్టం అంటారు.
  • బెంగాల్ గవర్నర్ యొక్క హెూదాను “గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్"గా మార్చి ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమించబడినది వారన్ హేస్టింగ్స్,"
  • బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్కు ఆధీనులుగా చేయడం జరిగింది.
  • కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికనుగుణంగా 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.