Type Here to Get Search Results !

Vinays Info

బౌద్ధుల కాలంనాటి విద్యావిధానం (Educational system of Buddhist period)

Top Post Ad

బౌద్ధుల కాలంనాటి విద్యావిధానం (Educational system of Buddhist period)

బౌద్ధుల కాలంనాటి విద్యావిధానం వేదకాలంనాటి విద్యావిధానానికి భిన్నంకాదు. హిందూమతంలోని లోపాలను సంస్కరించడానికి 6వ శతాబ్ధంలోనే విస్తరించింది. “మోక్షసాధన” ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతం బౌద్ధమతం. ఈ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా అన్నివర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ కాలం ప్రాథమిక విద్యాభ్యాసంలో భాగంగా ఎనిమిది సంవత్సరాల వయస్సుగల విద్యార్థులు విద్యాసంస్థలో ప్రవేశానికి అర్హులు. ఈ విద్యార్థి దశను "పబ్బజ" ముందుకుపోవడం (Going forth) ఉత్సవంలో విద్యారంభం అయ్యేది. బౌద్ధవిద్య విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని “సమనేరులు' వ్యవహరించేవారు. వీరంతా విహారాల్లో, మఠాల్లో విద్యనభ్యసించేవారు. 20 సం॥ వచ్చేనాటికి విద్యార్థులకు "ఉపసంపద" అనే ఉత్సవం జరిపించి వారిని సంఘపరివారంలో సభ్యులుగా చేర్చుకునేవారు.

విద్యా లక్ష్యాలు

1. విముక్తి (Liberation)

2. జీవికకు సిద్ధం కావడం

3. నైతిక అభివృద్ధి

5. సత్యసందమైన జీవనం

6. నిరాడంబర జీవితం

ఉపాధ్యాయులు భిక్ష స్వీకరించి పన్నెండేళ్లు దాన్నే అనుసరించిన సన్యాసులు, వారు తమ వద్ద విద్యాభ్యాసానికి చేరిన విద్యార్థుల పట్ల పితృభావంతో మెలిగేవారు. విద్యార్థులు సంపూర్ణబాధ్యత తీసుకొని, వారికి లౌకిక జ్ఞానంతోపాటు ఆధ్యాత్మిక జ్ఞానసంపదను కూడా అందించేవారు. బౌద్ధుల కాలంలో ముఖ్య ఉద్దేశ్యం నిర్వాణం లేదా మోక్ష సాధన. అయినప్పటికిని నూలు తీయడం, వడకడం, బట్టలు కుట్టడం, చిత్రలేఖనం, ఆయుర్వేదం, శిల్పకళ మొదలయినవి ఉండేవి. ఎలిమెంటరీ విద్యలో చదవడం, రాయడం, లెక్కలు చేయడం (3R's) మొదలగునవి కూడా నేర్పేవారు. విద్యాబోధన పాళీ, ప్రాకృతభాషల్లో జరిగేది. బోధనలో కంఠస్థం చేసే పద్ధతితో పాటు ఉపన్యాస పద్ధతికి కూడా చోటు లభించింది. స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ బౌద్ధమత తత్వంతోపాటు లౌకికవిద్యను కూడా అందించేవారు. 

ప్రాచీనకాలంలో ప్రఖ్యాత విద్యాసంస్థలు

వేదకాలంనుంచి బౌద్ధకాలంవరకు గురుకులాలు, సంఘాలు, పరిషత్తులు, చరణాలు (charana) బౌద్ధారామాలు విద్యాసంస్థలుగా గుర్తింపు పొందాయి. ఆ కాలంలో ఆయుర్వేదం, ధనుర్వేదం, న్యాయవిద్యలకు కేంద్రంగా తక్షశిల గుర్తింపు పొందింది. తత్వశాస్త్రానికి, సంగీత శాస్త్రానికి ప్రసిద్ధిచెందాయి. ఎన్నాయరమ్, ధర్, మలకాపురమ్, తిరుముక్కడులు మొదలైన స్థలాలు విద్యాకేంద్రాలయి విలసిల్లాయి. అగ్రహారాలు కేంద్రంగా హైందవ విద్య అందించబడేది. బెంగాల్లోని 'టోల్' అనే విద్యావ్యవస్థ కూడా ఇదే పద్దతిలో విద్యను విస్తరిస్తూ తదుపరి బౌద్ధవిద్యాకేంద్రాలుగా ప్రసిద్ధిచెందాయి.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.