Type Here to Get Search Results !

Vinays Info

ఉత్తర వేదకాలపు విద్యావిధానం (Northern Vedic system of education)

Top Post Ad

ఉత్తర వేదకాలపు విద్యావిధానం(Northern Vedic system of education)

ఉత్తర వేదకాలంలో ఆర్యులు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలుగా ఏర్పరచారు. తత్ఫలితంగా ఒక్కో వర్గంవారు ఒక్కోవృత్తిని స్వీకరించేవారు. ఈ విధానంలో ఒక వృత్తివారు మరోవృత్తిలోకి మారడానికి వీలు కల్పించబడింది. పి. ఎల్. రావత్ (1976)ను అనుసరించి వర్ణాల విభజనలో మొదట పట్టింపులు లేకపోయినా ఆ తరువాత కాలంలో ఈ విధానం పూర్తి సంప్రదాయ విధానంగా మారిపోయింది. ఈ కారణంగా అన్ని వర్ణాల వారికి లౌకిక విద్య అందించడంతోపాటు ఆయా వర్ణాలవారి అవసరాలకు కావలసిన విద్యను అందించడం ప్రారంభమైంది.

ఈ కాలంలో తండ్రి నుంచి కుమారుడికి వారసత్వంగా వృత్తి సంక్రమించింది. తండ్రులు తమకు తెలిసిన జ్ఞానాన్ని అనుభవాలను తమ పిల్లలకు అందించేవారు. ఈ కాలంలో నాలుగు వర్ణాల వారికి ఆయుర్వేదం, పశువైద్యం, సైనిక యుద్ధవిద్యలు, లలితకళలు, చేతి పనులతోపాటు వృత్తివిద్యను పిల్లలకు బోధించేవారు.

ఉత్తర వేదకాలపు విద్యావిధానం(Northern Vedic system of education)కాలంలో విద్యాలక్ష్యాలు

  • పిల్లలను వారి భావిజీవితానికి సన్నద్ధపరచడం
  • విద్యాపరమైన అభిరుచులు ఆసక్తులను పెంపొందించడం బ్రహ్మచర్యంతో కూడిన అభ్యసనాన్ని ప్రోత్సహించడం
  • ఆధ్యాత్మిక విలువలను యజ్ఞయాగాదులు, పూజలు పునస్కారాలతో పెంపొందించడం గురుశిష్యుల మధ్య అన్యోన్య సంబంధాలను ప్రోత్సహించడం

విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించడం బ్రాహ్మణ కాలంలో విద్యాబోధన మౌఖికంగానే జరిగినా తాళపత్రాలు, భోజపత్రాలపై లిపి రూపంలో శ్లోకాలను రాయడం ప్రారంభమైంది. ఈకాలపు విద్యకు మతప్రాతిపదికలు ఉన్నప్పటికీ ఇతిహాసాలు, పురాణాలు, సంహిత, చందశ్శాస్త్రం, వ్యాకరణం, తత్వశాస్త్రం బోధించేవారు. మొత్తంమీద ఈ కాలంలో విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. గురుకులాలే విద్యాలయాలై పలువురు విద్యార్థుల భవిష్య జీవనానికి పునాదులు వేశాయి.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.