సైమన్ కమీషన్(Simon Commission) - 1927
▪️ భారత ప్రభుత్వచట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి ఆనాటి బ్రిటీష్ ప్రధాని "బాల్డ్విన్” 1927 నవంబర్లో సర్ జాన్ సైమన్ నాయకత్వంలో 7గురు సభ్యులతో కూడిన ఒక రాయల్ కమీషన్ను నియమించింది.
▪️ ఈ సంఘంలో సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల భారతీయులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. కమీషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
▪️ 1928 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు, రెండవ పర్యాయం 1928 అక్టోబర్ 11 నుండి 1929 ఏప్రిల్ 6వ తేదీ వరకు పర్యటించింది. ఈ కమీషన్ తన నివేదికను 1930లో సమర్పించింది.
'మొదటిసారిగా సమాఖ్యను సూచించినది సైమన్ కమీషన్'. సైమన్ కమీషన్ అనేది భారత సమస్యలపైన ఒక సమగ్ర అధ్యయనం అని “కూప్లాండ్” అనే రచయిత పేర్కొంటారు. బ్రిటన్లోని లేబర్పార్టి ఈ నివేదికలోని అంశాలపైన తీవ్రమైన దృష్టిపెట్టలేదు. తరువాత వచ్చిన భారత ప్రభుత్వ చట్టం, 1935లో సైమన్ కమీషన్ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచారు.