Type Here to Get Search Results !

Vinays Info

భారతస్వాతంత్ర్య చట్టం(Independence Act of India) -1947

భారతస్వాతంత్ర్య చట్టం(Independence Act of India) -1947


భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం రూపొందించిన చిట్టచివరి చట్టం బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లా ఆధ్వర్యంలో భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్బాటన్ సలహామేరకు 1947 జులై 4వ తేదీన బ్రిటీషు పార్లమెంటులో భారత స్వాతంత్ర ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బ్రిటీషురాణి 1947 జులై 18వ తేదీన సంతకం చేసింది. ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశాలు
  • ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటికోసం వేరు వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
  • స్వదేశీ సంస్థానాలపై బ్రిటీషు సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  • భారత వ్యవహారాల కార్యదర్శి పదవికూడా రద్దవుతుంది.
  • బ్రిటీషు రాజు లేక రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
  • గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు.
ప్రముఖుల వ్యాఖ్యానాలు

నడిరాత్రి గంటకొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం మేల్కొని ఊపిరిని స్వేచ్ఛ పొందుతుంది, భారతదేశ ప్రజలు, విశాల మానవాళి సేవకోసం ప్రయాణాన్ని చేయడం ఈ సమయంలో సమంజసం. భారతదేశ సేవ అంటే దేశంలోని కోట్లాది పీడితుల సేవ. - నెహ్రూ

మన స్వల్పమైన బాధల వల్ల, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం కూడా అని తెలుసుకోవాలి. బ్రిటీషు పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయ సిద్ది కూడా కొద్దో, గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి. - రాజేంద్రప్రసాద్.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section