తెలంగాణ బడ్జెట్ 2017-18 ముఖ్యాంశాలు
1,49,646 కోట్లతో 2017- 18 రాష్ట్ర బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ 2017-18ని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకువచ్చారు. సబ్ప్లాన్ల స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు.
-రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు
-ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
-నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు
-మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు
-బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
-ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
-బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
-ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
-చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు
-చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు
-ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు
-విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
-మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
-రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
-గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు
-జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
-శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
-హరితహారానికి రూ. 50 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
-పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు
-ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు
-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు
-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు
-నిర్ణీత కాలానికి పథకాల వారీగా 3 నెలలకొకసారి నివేదిక సమర్పించాలి
-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం
-19.61 శాతం వృద్ధిరేటు సాధించాం
-రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది
-కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం
-2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం
-రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం
-కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది
-ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు
-ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం
-ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది
-నాపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
- వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది
* నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
* ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
* రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
* ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
* ఎస్సీల అభివృద్ధికి రూ.14,375కోట్లు
* ఎస్టీల అభివృద్ధికి రూ.8,165కోట్లు
* పారిశ్రామిక రంగానికి రూ.985కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.4,203కోట్లు
* హరితహారానికి రూ.50కోట్లు
* ఐటీ రంగానికి రూ.252కోట్లు
* శాంతి భద్రతలకు రూ.4,828కోట్లు
* పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ.198కోట్లు
* రహదారుల అభివృద్ధికి రూ.5,033కోట్లు
* జీహెచ్ఎంసీకి రూ.1000కోట్లు
* గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌కు రూ.300కోట్లు
* మిగతా కార్పోరేషన్లకు రూ.400 కోట్లు
* మిషన్ భగీరథకు రూ.3,000కోట్లు
* పట్టణాభివృద్ధికి రూ.5,599కోట్లు
* పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ.14,723కోట్లు
* విద్యారంగ అభివృద్ధికి రూ.12,705కోట్లు
* వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976కోట్లు
* జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.30కోట్లు
* చేనేత కార్మికుల కోసం రూ.1200కోట్లు
* ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1000కోట్లు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.1939కోట్లు
* బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు
* ఆసరా ఫించన్ల కోసం రూ.5,330కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.1,249కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.5,070కోట్లు
* మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731కోట్లు
* వ్యవసాయ రంగానికి రూ.5,942కోట్లు
* గర్భిణీలకు మూడు విడతలుగా రూ.12వేల ఆర్థిక సాయం. ఆడపిల్ల ప్రసవిస్తే మరో రూ.వెయ్యి అదనం.
* శిశువుకు అవసరమయ్యే 16 వస్తువులతో కూడిన కిట్ పంపిణీ.
* ఒంటరి మహిళలకూ ఆసరా ఫించన్లు వర్తింపు.
* మూసీ నది ప్రక్షాళనకు రూ.3,060కోట్లు
* సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి సైనిక నిధి ఏర్పాటు
* హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
* ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు ప్రత్యేక నిధి
* మృతదేహాలను తరలించేందుకు మరో నూతన 50 వాహనాలు ఏర్పాటు
* అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.7,500 నుంచి రూ.10,500 పెంచాం.
* అంగన్వాడీ సహాయకుల వేతనాలు రూ.4,500 నంచి రూ.5వేలకు పెంచాం
* ఎస్సీ, ఎస్టీల కోసం 130 గురుకులాలను ఏర్పాటు చేశాం.
* విదేశాల్లో చదువుకోవాలనే పేద విద్యార్థుల కోసం రూ.20లక్షలు ఇస్తున్నాం.