నేడు.."వరల్డ్ కిడ్నీ డే "(ప్రతి ఏటా మార్చి 2వ గురువారం)
■ మూత్ర పిండాల పట్ల ప్రజల్ని జాగృతం చేసే ఉద్దేశ్యము తో ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ సొసైటీ (INS-International Nephro logy society) , ఇంటనేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ (IFKF) లు సంయుక్తం గా వరల్డ్ కిడ్నీ డే ను ఏటా నిర్వహిస్తున్నారు.
*▪ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ సొసైటీ లాభేతర సంస్థ. మూత్ర పిండాల వ్యాధులగుర్తింపు,చికిత్స,నియంత్ర ణలను ప్రపంచ వ్యాప్తంగా చేపట్ట డం ఈ సంస్థ ప్రధాన ధ్యేయము.*
*■ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ 1999 లో ఏర్పాటైన లాభేతర సంస్థ . 63 కిడ్నీ ఫౌండేషన్ల సభ్యత్వము , 41 దేశాలలో పేషెంట్ గ్రూఫులు ఉన్నాయి . కిడ్నీ వ్యాధులు గలవారికి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవా ల్సిన విధానాన్ని , జీవన ప్రమాణాల పెంపు గురించి , చికిత్సలు , జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరిస్తుంది . వివిద దే్శాలలో కిడ్నీ ఫౌండేషన్ల ఏర్పాటుకు సహకరిస్తుంది . ఈ రెండు సంస్థలు అధ్వర్యములో ఏటేటా " వరల్డ్ కిడ్నీ డే" నిర్వహిస్తుస్తున్నారు . మూత్రపిండాల వ్యాధుల్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంతసులువుగా తగ్గించుకోవచ్చు.*
■ ఇటీవల జాతీయ కిడ్నీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా తమకి కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు కూడా తెలియదట! ప్రత్యేక లక్షణాలు ప్రారంభ దశలో లేకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు గ్రహించారు. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవాళ్లు.. అంటే డయాబెటిస్, అధిక రక్తపోటు లాంటి వాటితో బాధపడేవారు తరచూ కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవ టం అవసరమని అంటున్నారు.
*■ ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిందేంటంటే 78 శాతం మందికి లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి వృద్ధి చెందుతుందని. ఇంకా విచిత్రమే మిటంటే 32 శాతం మందికి మూత్రం కిడ్నీల ద్వారానే వస్తుందని తెలియదు.*
■ అందుకే మూత్రపిండాల నిర్మాణం గురించి, అవి చేసే పనుల గురించి, అవి దెబ్బతినే కారణాల గురించి, దెబ్బ తినకుండా తీసుకునే చర్యల గురించి తెలుసుకోవాల్సిన అవసర ముందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. కిడ్నీ డిసీజ్ చాలా సైలెంట్‌గా వ్యాప్తి చెందు తుంది కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవా ల్సింది ఏమిటంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, వంశపారంపర్య చరిత్ర ఉన్నవారు తరచూ కిడ్నీ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాల’ని అంటున్నారు
*■ ఈ జాగ్రత్తలతో మూత్రపిండాల వ్యాధులు ప్రబలకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.అపరిశుభ్రత వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది తరచూ ఈ ఇబ్బందికి లోనవుతుంటారు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్స్, మూత్రపిండాలలో రాళ్లు లాంటివి కలుగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.*
*■ అలాగే డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు వస్తే నొప్పి కూడా తెలియదు డయాబెటిస్ ఉన్నవారికి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.*
■ ఇదే కాదు మూత్రపిండాల జబ్బులు సైలెంట్ కిల్లర్స్ తీవ్రమయ్యే వరకూ ఎటువంటి లక్షణాలు కనిపించవు. అలాగే అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రభావం కిడ్నీల మీదా ఉంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే ఈ అనారోగ్య ప్రభావం క్రమంగా గుండె మీదా పడే అవకాశముంది. అందుకని కిడ్నీల ఆరోగ్యం జాగ్రత్త.
■ కిడ్నీ ఆరోగ్యంతోపాటు గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అని హెచ్చరిస్తుంది ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే.
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)