National Youth Day (జాతీయ యువజన దినోత్సవం)

VINAYS INFO
VINAYS INFO

National Youth Day 2022 (జాతీయ యువజన దినోత్సవం) - జనవరి 12

National Youth Day
National Youth Day(జాతీయ యువజన దినోత్సవం)

  • జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.

ఉద్దేశ్యం:
  • యువతలో దాగున్న నిగూఢ శక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?(History of National Youth Day in Telugu)
  • 1984 లో భారత ప్రభుత్వం జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.
  • 1985 నుంచి ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
జనవరి 12 నే ఎందుకు?
  • భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానందుడు 1863 జనవరి 12 న జన్మించాడు.
  • ఆయన జన్మదినం అయిన జనవరి 12 ను ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
స్వామి వివేకానంద గురించి
  • పేరు: స్వామి వివేకానంద
  • అసలు పేరు: నరేంద్ర నాథ్ దత్తా
  • జననం: 1863 జనవరి 12
  • జన్మస్థలం: కలకత్తా, బెంగాల్ ప్రిసిడెన్సీ (ఇప్పటి కోల్కత)
  • తల్లిదండ్రులు: భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్త
  • చదువు: 1884 లో B.A పాస్ అయ్యాడు
  • వృత్తి: ఉపాధ్యాయుడు, సన్యాసి
  • గురువు: రామకృష్ణ పరమహంస  
  • స్థాపించిన సంస్థలు: బేలూరు మఠం, రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్
  • ఈ సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. 
  • మరణం: 1902 జూలై 4 (వయసు 39)
  • మరణించిన ప్రదేశం: బేలూరు మఠం, బెంగాల్ ప్రిసిడెన్సీ
  • శిష్యులు: స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత, స్వామి సదానంద
  • తత్వం: ఆధునిక వేదాంతం, రాజా యోగం
  • రామకృష్ణ మఠం: 1897 లో పశ్చిమ బెంగాల్ లోని బేలూరు మఠం వద్ద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు.

You may like these posts

Post a Comment